Payal Rajput Prabhas Gossip.. మీకు తెలుసా.? పాయల్ రాజ్‌పుత్‌కీ ప్రభాస్‌కీ పెళ్ళంట.! ఛత్.. ఎవరు చెప్పారు మీకు.?
ఎవరో చెప్పడమేంటి.? పెళ్ళి జరిగిపోయింది కూడానట.! ఇది మరీ విడ్డూరంగా వుంది కదా.! ఏంటి నిజమేనా ఇదంతా.?
ఆగండాగండీ.. పాయల్ రాజ్‌పుత్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.. ప్రభాస్‌తో తన పెళ్ళయిపోయిందంటూ గాసిప్స్ వచ్చాయని.!
Payal Rajput Prabhas Gossip.. అనుష్క కాదా.? పాయల్ రాజ్పుత్తోనా.?
ఓ ఫిమేల్ పొలిటీషియన్తో ప్రభాస్‌కి లింకులు కట్టి గాలి వార్తలు ప్రచారం చేయడం తెలిసిన విషయమే. సదరు లేడీ పొలిటీషియన్, అప్పట్లో ఈ విషయమై పోలీసుల్ని ఆశ్రయించారు కూడా. అది వేరే చర్చ.
సినీ రంగంలో అయితే, ప్రతిసారీ అనుష్క శెట్టితో ప్రభాస్ పెళ్ళంటూ గాలి వార్తలు వినిపిస్తుంటాయి. ఇద్దరూ చాలా సందర్భాల్లో ఆ పుకార్లను కొట్టి పారేశారు కూడా.
Also Read: నాసిరకం ‘దేవర’.! కక్కుర్తి.? నిర్లక్ష్యం.? అసలేమైంది.?
‘మీకు బాగా నవ్వు తెప్పించిన గాసిప్..’ అంటూ ఓ ప్రశ్న ఓ సందర్భంలో ఎదురైతే, దానికి సమాధానమిస్తూ, ‘ప్రభాస్‌తో నాకు పెళ్ళయిపోయిందంటూ వచ్చిన గాసిప్’ అని సెలవిచ్చింది పాయల్ రాజ్‌పుత్. అదీ సంగతి.
నిజంగానే, చాలా ఫన్నీ గాసిప్ ఇది.! ఎక్కడా వినిపించని ఆ గాసిప్‌ని పాయల్ రాజ్‌పుత్ ప్రస్తావించడం నిజంగానే చాలా చాలా ఫన్నీ థింగ్.!
