Shraddha Kapoor Nani Tollywood.. తెలుగులో ఆమెకి తొలి సినిమా ‘సాహో’.! భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సాహో’ అంచనాల్ని అందుకోలేకపోయింది.
సహజంగానే, సినిమా ఫెయిలయితే.. ఆ ఇంపాక్ట్ ఆ సినిమాలోని హీరోయిన్ కెరీర్ మీద కూడా పడుతుంది. అందుకే, మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదామె.

తెలుసు కదా.. ఆ బ్యూటీ ఎవరో.! ఇంకెవరు, శ్రద్ధా కపూర్.! ‘సాహో’ సినిమాకి ముందు తెలుగు నాట ఆమె గురించి ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు.!
కానీ, సినిమాలో శ్రద్ధా కపూర్.. నటిగా అంత గొప్పగా చేసిందేమీ లేదనే విమర్శలొచ్చాయ్. ఆ సంగతిని పక్కన పెడితే, చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించబోతోందట ఈ బ్యూటీ.
Shraddha Kapoor Nani Tollywood.. నాని కోసం వస్తోందా.?
ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది కదా.! అందుకే, హీరోయిన్ల ఎంపిక విషయమై, ‘పాన్ ఇండియా’ ఆలోచనలే చేస్తున్నారంతా.
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమా కోసం బాలీవుడ్ నుంచి శ్రద్ధా కపూర్‌ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

అన్నీ అనుకున్నట్లు జరిగితే, నాని – శ్రద్ధా కపూర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కి అంతా సెట్ అయిపోయినట్లే.! కాకపోతే, ప్రత్యామ్నాయం కూడా ఆలోచిస్తున్నారట.
శ్రద్ధా కపూర్ ఎందుకు దండగ.. అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయ్. సౌత్‌లో హీరోయిన్లు లేరా.? బాలీవుడ్ నుంచి ఎందుకు డంప్ చేసుకోవాలి.? అన్న చర్చ జరుగుతోంది.
Also Read: తల్లి చిన్మయి, తండ్రి రాహుల్.! ఓ చిన్నారి.. వ్యధ.!
మరో ఇద్దరు హీరోయిన్ల పేర్లు కూడా ప్రచారంలో వున్నాయ్ నాని సినిమా కోసం. త్వరలోనే ఫైనలైజ్ చేయబోతున్నారట.
ప్రస్తుతానికైతే శ్రద్ధా కపూర్ పేరు దాదాపుగా లాక్ అయిపోయిందనే అంటున్నారు. శ్రద్ధా కపూర్ మంచి నటి.. ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు. మొన్నీమధ్యనే వచ్చిన ‘స్త్రీ-2’ సినిమాతో శ్రద్ధా కపూర్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యింది.