Arjun Son Of Vyjayanthi Review.. తల్లి కోసం ఎలాంటి త్యాగమైనా చేయొచ్చు.. ఎందుకంటే, తల్లి మన కోసం చేసే త్యాగం అలాంటిది.!
తల్లి గొప్పతనం గురించీ, తల్లి ప్రేమ గురించీ.. చాలా సినిమాల్లో చాలా చక్కగా చూపించారు. తల్లి మీద కొడుకు ప్రేమ గురించిన సినిమాలూ చాలానే వచ్చాయ్.
అమ్మ మీద వచ్చినన్ని సినిమాలు, నాన్న మీద కూడా రాలేదన్నది నిర్వివాదాంశం. సినిమాల్లో ‘అమ్మ’ సెంటిమెంటు ఎప్పుడూ సూపర్ హిట్టే.. అంటారు సినీ జనాలు.!
సరే, అమ్మ సెంటిమెంటుతో వచ్చిన సినిమాలూ ఫ్లాపులైన సందర్భాల్లేకపోలేదనుకోండి.. అది వేరే సంగతి.
లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి రీ-ఎంట్రీలో చేసిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఆ తర్వాత ఆమె నటించిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.
పోలీస్ గెటప్‌లో విజయశాంతిని చూసి, ఆమె అభిమానులు సంబరపడ్డారన్నది నిర్వివాదాంశం. సినిమా ప్రమోషన్లు గట్టిగానే జరిగాయి. స్క్రీన్ స్పేస్ కూడా విజయశాంతికి బాగానే దక్కింది.
Arjun Son Of Vyjayanthi Review.. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కథా కమామిషు ఏంటి.?
తల్లి పోలీస్ అధికారిణి.. కొడుకేమో, పోలీస్ వ్యవస్థకు సమాంతరంగా తనదైన స్టయిల్లో ఓ గ్యాంగ్‌ని నడుపుతుంటాడు.. విశాఖని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు.
కొడుకు చేసిన హత్యకు ప్రత్యక్ష సాక్షి అయిన తల్లి, న్యాయ పోరాటం చేస్తుంది కొడుక్కి శిక్ష పడేలా చేయాలని. కొడుక్కి మాత్రం, తల్లి అంటే వల్లమాలిన ప్రేమ.
ఐపీఎస్ క్లియర్ చేసిన కొడుకు, హత్యలు ఎందుకు చేస్తాడు.? అన్నది అసలు కథ. బోల్డన్ని సినిమాలు చూసేశామని అంటారా.? అది మీ తప్పు కానే కాదు.
ఎన్ని సినిమాలు ఇదే ఫార్మాట్లో వచ్చినా, నిజానికి బోర్ కొట్టని కాన్సెప్ట్ ఇది. పురాతన కాలం నుంచి, మోడ్రన్ ట్రెండ్ వరకు.. ఈ తరహా సినిమాలు వస్తూనే వున్నాయ్.
చెయ్యి నరుక్కుని.. ట్రెండ్ సెట్ చేసిన కళ్యాణ్ రామ్..
క్లయిమాక్స్‌లో హీరో, తన చేతిని నరికేసుకుంటాడు.. తల్లిని కాపాడటానికి. ఆ తర్వాత ఒంటి చేత్తోనే ఫైట్ చేసేస్తాడు. అలా హీరో, తన చేతిని నరుక్కునే సీన్‌తో, సినిమానే నిర్దాక్షిణ్యంగా నరికేశాడు దర్శకుడు.
అసలు ఈ పాయింట్ చెప్పి కళ్యాణ్‌రామ్‌ని ఎలా ఒప్పించాడు.? విజయశాంతిని ఎలా ఒప్పించాడు దర్శకుడు.? అదే బిగ్ క్వశ్చన్.
ఇలాంటి సీన్ రాసుకోవడం తప్పు కాదు, కానీ.. దాన్ని కన్విన్సింగ్‌గా చెప్పగలగాలి కదా.? ప్చ్.. బ్యాడ్, వరస్ట్.. అగ్లీ అని కూడా అనొచ్చు.. అలా డిజైన్ చేశారు.
చేతికి బేడీలేసి, స్తంభానికి కట్టేస్తే.. మొత్తం స్తంభాన్ని నేల కూల్చేసే హీరో.. అని ఆ సీన్‌ని డిజైన్ చేసినా, కన్విన్సింగ్‌గా వుండేదేమో.!
Also Read: అంబటి రాయుడి ‘గుడ్డి’ సిద్ధాంతం.!
నరుకుడు సీన్ పక్కన పెడితే, హీరో – హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ.. అర్థం పర్థం లేకుండా తయారైంది. తల్లికి – కొడుక్కీ మధ్య సీన్స్ కూడా చిరాకు తెప్పిస్తాయ్.
చివర్లో శ్రీకాంత్ తన విలనిజం బయటపెడతాడు. అది ఇంకా కామెడీ అయిపోయింది. విలన్ని బాలీవుడ్ నుంచి తీసుకొచ్చారు.. సొహైల్ ఖాన్ వేస్టయ్యాడు.
వాట్ నాట్.. సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు.. సేమ్ బోరింగ్ టెంపో.. అంతే.! రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా.. అని సరిపెట్టుకునేంత లోపు, నరుకుడు సీన్.. భయానకం.
ఆ పోలీసులేంటో, ఆ జైళ్ళు ఏంటో.. అంతా గందరగోళం. లాజిక్కుకి దూరంగా సినిమాలుండడం కొత్త కాదు.. కానీ, మరీ ఇంత చెత్తలానా.?
ఏ చెత్త తీసినా ప్రేక్షకులు చూస్తార్లే.. అన్న ‘నిర్లక్ష్యం’తో సినిమాలు తీస్తే, ఇదిగో ఇలానే తగలడుతుంది. థియేటర్లకు జనాలు ఎందుకు రావట్లేదు.? అంటే, ఇదిగో ఇందుకే.!
ఓటీటీలో ఉచితంగా చూడాల్సి వచ్చినా, దండగే ఇలాంటి సినిమాలు.. అన్న అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చేస్తే.. ఆ తర్వాత తెలుగు సినిమా పరిస్థితి ఇంకెంత దయనీయంగా మారుతుందో.!
నో డౌట్.. విజయశాంతి మంచి నటి. ఆమెని సరిగ్గా వాడుకోకపోతే ఎలా.? కళ్యాణ్ రామ్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కి అర్థమేంటో, దర్శకుడు సబ్ టైటిల్స్ అయినా పెట్టి వుండాల్సింది.
చివరగా.. హీరో చేతిని కాదు, సగటు సినీ ప్రేక్షకుడి గొంతు కోసేసిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి.