Table of Contents
OG Vs Akhanda2 సోషల్ మీడియా వేదికగా అభిమానులు చేసుకునే ‘ఫ్యాన్ వార్స్’ వేరు.. సినిమాలకు సంబంధించిన లెక్కలు వేరు.!
వాస్తవానికి, ఫ్యాన్ వార్స్.. సినిమాలకు పబ్లిసిటీ పరంగా హైప్ తెస్తాయి.. ఒక్కోసారి ఆయా పబ్లిసిటీ స్టంట్లు బెడిసికొడుతుంటాయి కూడా.
సినిమాల సంగతి పక్కన పెడితే, రాజకీయంగా పవన్ కళ్యాణ్ – నందమూరి బాలకృష్ణ కలిసి పని చేస్తున్నారు. ‘బ్లడ్డు – బ్రీడు’, ‘బురద జాతి’ వంటి విమర్శలు కాలగర్భంలో కలిసిపోయాయ్.
OG Vs Akhanda2,, వెనక్కి తగ్గాల్సిందెవరు.?
పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 25 రిలీజ్ డేట్. అదే రోజున, నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ ప్రేక్షకుల ముందుకొస్తుందనే ప్రకటన వచ్చింది.
కానీ, రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున విడుదలైతే, థియేటర్లు అడ్జస్ట్ అవడం కష్టం. గతంలో, చాలా సందర్భాల్లో చూశాం ఈ పరిస్థితిని.
ఒకే వారంలో విడదలయ్యే పరిస్థితి వుంటే, ఒకట్రెండ్రోజులు గ్యాప్ తప్పనిసరి. సో, ‘ఓజీ’, ‘అఖండ-2’ సినిమాల్లో ఏదో ఒకటి చివరి నిమిషంలో వెనక్కి తగ్గక తప్పదు.
‘అఖండ-2’ అంతా ఓకేనా.?
‘ఓజీ’ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ జరగాల్సి వుంది. అవి కూడా శరవేగంగా పూర్తయిపోతాయి. సో, పవన్ కళ్యాణ్ సినిమాకి లైన్ క్లియర్.
కానీ, ‘అఖండ-2’ వ్యవహారం వేరేలా వుంది. దర్శకుడు బోయపాటి, వేగంగానే పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేయించగలడు. కానీ, ఒకటే సమస్య.. అదే వీఎఫ్ఎక్స్.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 25 నాటికి వీఎఫ్ఎక్స్ పూర్తయి, ‘అఖండ-2’ సినిమా రావడం కష్టమేనని తెలుస్తోంది.
డిసెంబర్ వరకూ.?
డిసెంబర్‌కి ‘అఖండ-2’ షిఫ్టయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే గుసగుసలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ముందే చెప్పుకున్నాం కదా.. సోషల్ మీడియా వేదికగా హీరోల అభిమానుల కొట్లాటలు వేరు.. సినీ రంగంలో లెక్కలు వేరు. ఆ లెక్కల ప్రకారమే సినిమా రిలీజ్‌లు వుంటాయి.
Also Read: ‘లిటిల్ హార్ట్స్’ సమీక్ష: ఈ ‘తేడా’ వ్యవహారాలెందుకు చెప్మా.?
అన్నట్టు, పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘హరి హర వీర మల్లు’ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
వీఎఫ్ఎక్స్ కారణంగానే జూన్ 12న విడుదల కావాాల్సిన ‘హరి హర వీర మల్లు’ వాయిదా పడింది.. అదీ చివరి నిమిషంలో.