Table of Contents
Karungali Maala Power.. ఈ మధ్య ‘కరుంగళి మాల’ గురించి ఎక్కువగా వింటున్నాం. అసలేంటీ కరుంగళి మాల.? కరుంగళి అంటే ఏంటి.? వివరాలు తెలుసుకుందాం పదండిక.
కరుంగళి మాలని పురుషులు, మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు.. ఇలా ఎవరైనా ధరించొచ్చు. దీన్ని అత్యంత పవిత్రంగా భావించి, ధరిస్తే, సత్ఫలితాలు కలుగుతాయి.
వాస్తవానికి కరుంగళి మాల అనేది నల్లమల చెక్క (ఎబోనీ వుడ్) తో తయారుచేసిన ఒక ఆధ్యాత్మిక మాల. దీనిని జపమాలగా లేదా మెడలో ధరించే ఆభరణంగా ఉపయోగిస్తుంటారు.
హిందూ సంప్రదాయంలో ఈ కరుంగళి మాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇటీవలి కాలంలో దీని చాలా ప్రాచుర్యం బాగా పొందింది.
కరుంగళి చెట్టుకు విద్యుదయస్కాంత వికిరణాలు, కంపనాలను ఆకర్షించే శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ఈ కారణం వల్లనే నల్లమల చెక్కను ఆలయ గోపురాలు, విగ్రహాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
Karungali Maala Power.. కరుంగళి మాల ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు..
కరుంగళి మాల ప్రతికూల శక్తులు, దుష్ట శక్తులు, చెడు దృష్టి మరియు ప్రతికూల ఆలోచనల నుండి రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు. దీన్ని ధరించిన వారి చుట్టూ ఒక రక్షణ కవచాన్ని సృష్టిస్తుందట.
మానసిక ప్రశాంతతను చేకూర్చి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని కరుంగళి మాల చెబుతారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది ఉపకరిస్తుందిట.
ముఖ్యంగా కుజ గ్రహ దోషాలు ఉన్నవారు కరుంగళి మాలను ధరించడం వల్ల ఆ దోషాలు తొలగిపోతాయని, కుజుడి బలం పెరుగుతుందని జ్యోతిష్యులు సూచిస్తుంటారు.
వివాహ, దాంపత్య, సంతాన సమస్యలు కరుంగళి మాలను ధరించడంతోనే తొలగిపోతాయని బలంగా నమ్ముతారు.
ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేసే కరుంగళి మాల..
వ్యాపార రంగంలో ఉన్నవారికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కరుంగళి మాల ధారణ సహాయపడుతుంది. ఆర్థిక ఇబ్బందులను దూరం చేసి, సంపదను ఆకర్షిస్తుందని పండితులు చెబుతున్నారు.
కరుంగళి చెట్టు వేరు, బెరడుకు ఎన్నో ఔషధ గుణాలున్నాయని, మధుమేహం, పెద్దప్రేగు రుగ్మతలు, రక్తహీనత వంటి వ్యాధులు నయమవుతాయట.
కరుంగళి మాల ధరించడం వల్ల అధిక శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
చర్మ సంబంధిత సమస్యలైన దద్దుర్లు, గాయాలు, మొటిమలు, సోరియాసిస్ వంటి వాటికి కరుంగళి చెక్కను నీటిలో నానబెట్టి ఆ నీటిని వాడతారు.
ధ్యానం, జపానికి కరుంగళి మాలను ఉపయోగించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, ఆధ్యాత్మికంగా ఉన్నతికి దారి తీస్తుందని నమ్ముతారు.
కరుంగళి మాల ధరించేవారు ఎలాంటి నియమాల్ని పాటించాలంటే..
కరుంగళి మాలను మంగళవారం రోజు ధరించడం ఉత్తమం అని కొందరు పండితులు సూచిస్తారు. ఇది ఏ వయసువారైనా ధరించడానికి ఆమోదయోగ్యమైనది.
ఒరిజినల్ కరుంగళి మాలను గుర్తించడం ముఖ్యం, ఎందుకంటే మార్కెట్‌లో నకిలీవి చాలానే అందుబాటులో ఉన్నాయి. తమిళనాడులోని పాతాళ శంభు మురుగున్ దేవాలయంలో ఒరిజినల్ మాల దొరుకుతుంది.
ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇక్కడ కరుంగళి మాలల్ని భక్తులకు విక్రయిస్తుంటారు ఆలయ నిర్వాహకులు. పాతాల శంభు మురుగన్ ఆశీస్సులు కూడా ఈ మాల ధారణతో లభిస్తాయనేది భక్తుల విశ్వాసం.
కరుంగళి మాల పవర్ ఫుల్ గా పనిచేయాలంటే నమ్మకం చాలా ముఖ్యం. మాల ధరిస్తే సరిపోదు, అందులోని దాదాపు 108 పూసల్ని చేతితో స్పృశిస్తూ, ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి.
అప్పుడే, కరుంగళి మాలకు దైవత్వం లభిస్తుంది.. దాన్ని ధరించినవారికి మంచి జరుగుతుంది. అంతేగానీ, ట్రెండ్ ఫాలో అవుతున్నాం.. అన్న కోణంలో, మాలని ధరిస్తే ఉపయోగం లేదు.
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మార్గంలో కొందరు సాధువుల దగ్గర ‘కరుంగళి మాల’లు లభ్యమవుతాయి. చాలామంది వాటిని విక్రయిస్తారు. కొందరు,
కొందరు సాధువులు వాటిని ఉచితంగానే ఇస్తుంటారు. ఉచితంగా కరుంగళి మాల లభించడం చాలా అరుదు. లభిస్తే, అదృష్టం వరించినట్లే.