Nisha Aggarwal Actress Tollywood.. నిషా అగర్వాల్ గుర్తుందా.? నారా రోహిత్ హీరోగా నటించిన ‘సోలో’ సినిమాలో నటించింది కదా.? హీరో ఆది సాయికుమార్‌తోనూ ఓ సినిమాలో నటించిందీ బ్యూటీ.
ఇవన్నీ కాదు, అందాల చందమామ కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ అంటే, ఠక్కున గుర్తుకొస్తుంది. యస్.. ఆ నిషా అగర్వాల్ గురించే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం.
అక్క కాజల్ అగర్వాల్ చలవతో, సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది నిషా అగర్వాల్. కానీ, హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది.
Nisha Aggarwal Actress Tollywood.. పెళ్ళయ్యాక కూడా..
దాంతో, ఎక్కువగా ప్రయత్నాలేమీ కష్టపడి చేసెయ్యలేదు, యాక్టింగ్ కెరీర్ కొనసాగించడానికి నిషా అగర్వాల్. పెళ్ళి చేసేసుకుంది, లైఫ్‌లో సెటిలైపోయింది.
పెళ్ళి చేసేసుకుంటే, లైఫ్‌లో సెటిలైపోయినట్లేనా.? ఓ కొడుకు కూడా పుట్టాడామెకి. అసలు విషయం అది కాదు. కాజల్ అగర్వాల్ స్టార్ట్ చేసిన కొన్ని బిజినెస్‌లను నిషా చూసుకుంటోంది.

సినిమాల్లో లేకపోయినా, గ్లామర్ విషయంలో అస్సలు తగ్గడంలేదు నిషా అగర్వాల్. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోల్ని షేర్ చేస్తుంటుందీ బ్యూటీ.
అక్కతో కలిసి విహార యాత్రల సందర్భంగా బికినీల్లో ఫొటోలకు పోజులిచ్చి, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటుంది నిషా అగర్వాల్.

సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఎప్పుడని అడిగితే, మంచి కథలు దొరికితే.. అని పరమ రొటీన్ సమాధానమే వస్తుంటుంది నిషా అగర్వాల్ నుంచి.
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, అందం చందం.. వున్నా.. అవకాశాలే మొహం చాటేశాయి నిషా అగర్వాల్‌కి.