The Raja Saab Queens.. సినిమా హీరోయిన్లకు బోడి సలహా ఇచ్చాడు సినీ నటుడు శివాజీ.! వృద్ధ నారీ పతివ్రత.. తరహాలో, వయసు మీద పడ్డాక, నటుడు శివాజీకి ‘పద్ధతి’ గుర్తుకొచ్చింది మరి.!
నటుడిగా, తన కెరీర్‌లో పలువురు హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించేసిన శివాజీ, సినిమా ఫంక్షన్లకు పద్ధతిగా చీర కట్టుకుని రావాలంటూ, ఇటీవల హీరోయిన్లకు బోడి సలహా ఇచ్చి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే.
దాంతో, శివాజీ మీద అందరూ గుస్సా అయ్యారు. శివాజీ వాడిన బూతులకే ఆయన మీద మరింత అసహ్యం కలిగింది చాలామందికి.!
సరే, క్షమాపణ చెప్పి, వివాదానికి ముగింపు పలికే క్రమంలో.. ఇంకా శివాజీ పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూనే వున్నాడనుకోండి.. అది వేరే సంగతి.
ఇక, ‘సామాన్ల శివాజీ’కి, ‘బట్టల సత్తిగాడు’ అనే పేరు పెట్టేశాడు నిర్మాత ఎస్‌కేఎన్. ‘మీకు కంఫర్ట్‌గా వుండే దుస్తుల్ని ధరించండి’ అంటూ హీరోయిన్లకు ఎస్‌కేఎన్ కూడా ఓ బోడి సలహా ఇచ్చేశాడు.
చూస్తున్నారు కదా.. ‘ది రాజా సాబ్’ క్వీన్స్‌ని. రిద్ది కుమార్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్.. ఈ ముగ్గురూ ఇలా ఒకేసారి వేదికపై ఎంతందంగా దర్శనమిచ్చారో.
అసభ్య కోణంలో చూస్తే, అసభ్యతగానే వుంటుంది.. గ్లామరస్ కోణంలో చూస్తే గ్లామరస్‌గా వుంటుంది.. క్యూట్ కోణంలో చూస్తే, క్యూటుగానే వుంటుంది.. ఇదింతే.. కథ మారదంతే.!
‘శివాజీ చెప్తే మాత్రం.. మేం వింటామా ఏంటి.?’ అని, ఈ వివాదంలోకి తలదూర్చి, తనను తాను హీరోయిన్‌గా చెప్పేసుకున్న అనసూయ చెప్పినట్లు.. నిజమే, పై ముగ్గురు హీరోయిన్లు.. మారలేదు. తమ పని తాము చేసుకుపోయారు.
అన్నట్లు, ‘ది రాజా సాబ్’కి సంబంధించిన ఓ ఈవెంట్‌లో, నిధి అగర్వాల్ మీద కొందరు అభిమానులు ఎగబడ్డాన్ని, ఆసరాగా చేసుకుని, ‘సామాన్లు.. దరిద్రపు ముం..లు’ అనే కామెంట్ చేశాడు శివాజీ.
ఆ బోడి సలహా కూడా, శివాజీ ఇచ్చింది నిధి అగర్వాల్‌కే.! ఆ నిధి అగర్వాల్, అస్సలేమాత్రం గ్లామర్ తగ్గకుండా ‘ది రాజా సాబ్’ ఈవెంట్‌లో ఇదిగో ఇలా సందడి చేసింది. ఔను, ఏదీ మారదు.!
సినిమా అంటేనే గ్లామర్.. ఆ గ్లామరే లేకపోతే ఎలా.?
