Home » ఉస్తాద్.. పెద్ది.! బాబాయ్, అబ్బాయ్.. అదరగొట్టేస్తారు.!

ఉస్తాద్.. పెద్ది.! బాబాయ్, అబ్బాయ్.. అదరగొట్టేస్తారు.!

by hellomudra
0 comments
UBS Peddi Pawankalyan Ramcharan

UBS Pawankalyan Peddi Ramcharan.. జనవరిలో తెలుగు సినీ పరిశ్రమకి వసూళ్ళ సంక్రాంతిని తీసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.!

అలా ఈ ఏడాది, మెగా కాంపౌండ్‌లో సంబరాలు షురూ అయ్యాయ్.. అనుకోవచ్చు.!

గత ఏడాదిలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ‘ఓజీ’ కిక్కు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.! తక్కువ గ్యాప్‌లోనే పవన్ కళ్యాణ్ నుంచి మరో సినిమా రాబోతోంది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేస్తూ, లేటెస్ట్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ.

మార్చి 26న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశి ఖన్నా, శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్లు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

UBS Pawankalyan Peddi Ramcharan.. ఉస్తాద్ నుంచి పెద్ది వరకూ..

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి వచ్చిన ‘దేఖ్‌లేంగే సాలా..’ అంటూ సాగే ఆడియో సింగిల్ ఆల్రెడీ యూ ట్యూబ్‌లో రికార్డు వ్యూస్ కొల్లగొట్టేసింది.

ఇక, మెగా కాంపౌండ్ నుంచి మరో ప్రెస్టీజియస్ మూవీ రిలీజ్ డేట్ కూడా ఖాయమైపోయింది. అదే, ‘పెద్ది’. రామ్ చరణ్ – జాన్వీ కపూర్ జంటగా, బుచ్చబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పెద్ది’.

ఏప్రిల్ 30న ‘పెద్ది’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘పెద్ది’ నుంచి వచ్చిన ఫస్ట్ ఆడియో సింగిల్ ‘చికిరి చికిరి’ ఏ స్థాయి సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

త్వరలో ‘పెద్ది’ నుంచి మరో ఆడియో సింగిల్ రాబోతోంది. ‘పెద్ది’ ఈ ఏడాది విడుదలవుతున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమాల్లో ఒకటి.

ఓ వైపు ఆల్రెడీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సందడి కొనసాగుతూనే వుంది. ఇంకో వైపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మేనియా షురూ అయిపోయింది.

బాబాయ్ పవన్ కళ్యాణ్ జోష్‌కి, అబ్బాయ్ రామ్ చరణ్ జోష్ యాడ్ అయితే.. అది వేరే లెవల్.. అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group