Allu Arjun 42 Conditions.. ఒకప్పటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వేరు.. ఇప్పుడున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వేరు.!
ఎప్పుడైతే ‘స్టైలిష్ స్టార్’ అనే గుర్తింపుని కాదనుకున, ‘ఐకాన్ స్టార్’ అని తనకు తానే ‘గుర్తింపు’ ఇచ్చుకున్నాడో, అప్పటినుంచి అల్లు అర్జున్‌లో సహజత్వం లోపించింది.
అల్లు అర్జున్ నడక, నడత.. అన్నీ డ్రమెటిక్‌గా మారిపోయాయి. ఏదన్నా అల్లు అర్జున్ మాట్లాడుతుంటే, పెదాలపై ‘ప్లాస్టిక్ స్మైల్’ కనిపిస్తోంది.!
ఈ అభిప్రాయం గత కొన్నాళ్ళుగా సగటు తెలుగు సినీ అభిమాని నుంచి ప్రముఖంగా వినిపిస్తూనే వుంది. ఎందుకిలా.?
ఇంతలోనే, అల్లు అర్జున్.. నలభై రెండు నిబంధనలు.. అంటూ, ఓ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది.
అంతలోనే, ఆ వీడియో సోషల్ మీడియా నుంచి తొలగించబడింది. ఆ వీడియోలో మాట్లాడిన మహిళ, ‘నా మాటలకు కట్టుబడి వున్నాను.. కానీ, వేధింపులకు తట్టుకోలేక, వీడియోను తొలగించాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు.
Allu Arjun 42 Conditions.. అల్లు అర్జున్ టీమ్.. అన్ని అనర్థాలకీ కారణం.?
అల్లు అర్జున్ టీమ్, ‘ఆ నలభై రెండు నిబంధనలు నిజం కావు’ అని చెప్పుకునే ప్రయత్నం చేసింది.. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.
‘ఆ నలభై రెండు నిబంధనల’ కంటే, టీమ్ ఇచ్చిన వివరణతో.. అల్లు అర్జున్‌కి మరింత డ్యామేజ్ జరిగిందన్నది తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో వినిపిస్తున్న వాదన.
విషయం నేషనల్ మీడియా వరకూ పాకింది. నిజానికి, అక్కడి నుంచే ఈ ‘నలభై రెండు నిబంధనల’ అంశం తొలుత ప్రచారంలోకి వచ్చింది.
ఓ యూ ట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ.. అందులో ఓ మహిళ వ్యక్తం చేసిన అభిప్రాయం.. సదరు మహిళ గొప్ప ఇన్‌ఫ్లూయెన్సర్ కూడా కాదు.
ఎందుకింత తీవ్రంగా అల్లు అర్జున్ టీమ్ స్పందించాల్సి వచ్చింది.? మెగా కుటుంబంపై అల్లు ఆర్మీ అత్యంత జుగుప్సాకరంగా ట్రోలింగ్ చేస్తున్నప్పుడూ, ‘నా ఆర్మీ’ అని చెప్పుకున్న అల్లు అర్జున్, ఇప్పుడేంటి ఇంత త్వరగా తన టీమ్ ద్వారా డ్యామేజ్ కంట్రోల్ నిమిత్తం ప్రకటించినట్లు.?
చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయ్.! ‘అల్లు అర్జున్‌ని కలవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు.. ఆయనతో మాట్లాడటమంటే, బోల్డన్ని కండిషన్లు..’ అనే అభిప్రాయాలు సినీ పరిశ్రమలో వున్నాయి.
మొన్నామధ్యన అల్లు అర్జున్ ఓ కేసులో అరెస్టయి, జైలుకు వెళ్ళి, బెయిల్ మీద విడుదలైతే, ‘ఉదయం నుంచీ యూ ట్యూబ్ కెమెరాలు డజన్ల సంఖ్యలో గుమికూడిన వ్యవహారం’ వెనుక ఎంత డ్రామా నడిచిందో అందరికీ తెలిసిందే.
Also Read: మిల్కీ బ్యూటీ తమన్నా ట్రెండీ సిగ్నేచర్.!
ఆమె ఎవరో ఏదో మాట్లాడింది.. స్పందించకుండా లైట్ తీసుకుంటే, విషయం వేరేలా వుండేది. అల్లు అర్జున్ టీమ్, స్పందించడం ద్వారా ఆ ‘నలభై రెండు నిబంధనలకు’ అదనపు పబ్లిసిటీ ఇచ్చినట్లయ్యింది.
సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ఆర్మీ ట్రోల్ చేయని సినీ ప్రముఖుడు లేడంటే అతిశయోక్తి కాదు. అందరూ ఈ టీమ్ బాధితులే.!
ఈ క్రమంలో, ‘ఆ నలభై రెండు నిబంధనల’ వ్యవహారం విషయమై మరింత ట్రోలింగ్ జరుగుతోంది. మొత్తంగా చూస్తే, అల్లు అర్జున్ పరువు పోతోందిప్పుడు. డ్యామేజ్ కంట్రోల్‌కి కూడా అవకాశం లేదిప్పుడు.
తన ఆర్మీనీ, తన టీమ్‌నీ అల్లు అర్జున్ వున్నపళంగా ప్రక్షాళన చేసుకోవాల్సిందే.
