Director Manasa Sharma Rakasa.. సినీ రంగంలో మహిళలు రాణించడం అంత తేలిక కాదంటూ.. ఎప్పటికప్పుడు కొందరు, మీడియా ముందుకొచ్చి, తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తుంటారు.
హీరోయిన్లను నీఛంగా చూస్తారు.. ఇతర నటీమణుల పరిస్థితి మరింత దుర్భరం. టెక్నీషియన్లుగా మహిళలు చాలా చాలా కష్టమనే అభిప్రాయాల సంగతి సరే సరి.!
కానీ, దర్శకురాలిగా నందిని రెడ్డి తదితరులు తమ ఉనికిని చాటుకున్నారు.
అప్పట్లో విజయ నిర్మల, అంతకు ముందు భానుమతి, నందిని రెడ్డి కంటే ముందు బి.జయ.. చెప్పుకుంటూ పోతే, మహిళా దర్శకులు తక్కువమందే అయినా, వున్నారు తెలుగు సినీ పరిశ్రమలో.
ఆ మధ్య ‘వరుడు కావలెను’ సినిమాతో ఓ మహిళా దర్శకురాలు తన ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నించారు. ఆమె పేరు లక్ష్మీ సౌజన్య.
Director Manasa Sharma Rakasa.. తెలుగు తెరపైకి సరికొత్త టాలెంట్..
తాజాగా, మరో మహిళా దర్శకురాలి గురించిన చర్చ హాట్ హాట్గా జరుగుతోంది తెలుగు సినీ పరిశ్రమలో.. అదే సమయంలో, తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ మహిళా దర్శకురాలి గురించి మాట్లాడుకుంటున్నారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో, అభివృద్ధి పరంగా చాలా వెనక్కి నెట్టివేయబడ్డ జిల్లా శ్రీకాకుళం. ఆ శ్రీకాకుళంకి చెందిన మానస శర్మ గురించే ఇదంతా.
తెలుగు సినిమాల్లో శ్రీకాకుళం యాస గురించి జరిగిన యెటకారం గురించి కొత్తగా చెప్పుకునేదేముంది.? కానీ, ఈ మధ్య ఆ యాసని తెలుగు సినిమాల్లో బాగానే.. ఒకింత హుందాగానే వాడుతున్నారు.
హుందాతనం.. మానస సొంతం..
హుందాతనం.. మానస శర్మని చూస్తే, తొలుత అనిపించేది ఇదే. ఎంత హుందాగా వ్యవహరిస్తోంది, ‘రాకాస’ సినిమా ప్రమోషన్లలో.
నిర్మాత కూడా మహిళే ‘రాకాస’ సినిమాకి. ఆమె ఎవరో కాదు, ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాతో విజయాన్ని అందుకున్న నిహారిక.
నిహారిక సరదాగా ‘రాకాస’ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ వెళుతోంటే, ఆ ప్రమోషన్లలో చాలా చాలా హుందాగా వ్యవహరిస్తూ, చాలా క్యూటుగా కుర్రకారుని కట్టి పడేసింది దర్శకురాలు మానస శర్మ.
Also Read: చక్కనమ్మ చెవులకెందుకింత ‘బరువు’ బాధ్యతలు.?
అందుకేనేమో, ‘రాకాస’ సినిమా హీరో, హీరోయిన్, నిర్మాత.. వీళ్ళ కంటే, దర్శకురాలు మానస శర్మ గురించి ఎక్కువమంది మాట్లాడుకుంటున్నారు.
‘రాకాస’ విడుదలైంది. మంచి టాక్ సంపాదించుకుంది. దాంతో, మానస శర్మ రేంజ్ మరింత పెరిగింది. ఎంత ఎదిగినా ఒదిగి వుండడం.. తన అభిమాన నటుడు రామ్ చరణ్ని చూసి నేర్చుకున్నానంటోంది మానస.
సినిమాకి సంబంధించి దర్శకురాలిగా, అన్ని సాంకేతిక విభాగాలపైనా ఆమెకున్న పట్టు, స్క్రీన్ మీద కనిపించింది. సంగీత్ శోభన్, నయన సారిక ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.
