Home » వైఎస్ జగన్ ‘మావిగన్’ మూర్ఖత్వం: ఎద్దు ఈనింది.. దూడని కట్టెయ్!

వైఎస్ జగన్ ‘మావిగన్’ మూర్ఖత్వం: ఎద్దు ఈనింది.. దూడని కట్టెయ్!

by hellomudra
0 comments
Ys Jagan Mavigun

Ys Jagan Political Mavigun.. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని సమస్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే వచ్చి చచ్చింది.! ఔను, పెద్ద సమస్యే వచ్చి చచ్చింది మరి, రాజధాని రూపంలో.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, రాజధాని లేకుండా ఏర్పడ్డ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరమైంది. పదేళ్ళు హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని.. అని విభజన చట్టంలో పేర్కొన్నారు.

కానీ, విడిపోయాక.. ఉమ్మడి రాజధాని.. అదీ, ఆంధ్ర ప్రదేశ్‌కి చాలా దూరంలో.. అత్యంత దారుణమైన, అవమానకరమైన విషయమది.

అందుకే, తక్షణం రాజధానిని ప్రకటించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అమరావతిని, ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అప్పటి చంద్రబాబు సర్కార్ ప్రకటించేసింది.

Ys Jagan Political Mavigun.. మాట తప్పుతాడు.. మడమ తిప్పుతాడు..

అప్పటి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో వున్న అన్ని రాజకీయ పక్షాలూ, రాజధాని అమరావతికి మద్దతు పలికాయి. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, అమరావతికి మద్దతిచ్చారు.

కానీ, 2019లో అధికారంలోకి వచ్చాక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట తప్పారు.. మడమ తిప్పారు. మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారు.

అమరావతిని ఎడారి అనీ, స్మశానం అనీ, కమ్మరావతి అనీ.. అప్పటి వైసీపీ మంత్రులు నానా దుర్భాషలాడారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల్ని, అందునా మహిళా రైతుల్ని అప్పట్లో పోలీసులు బూటు కాళ్ళతో తొక్కేశారు.

అంత క్రూరంగా, పైశాచికంగా వ్యవహరించింది అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం. న్యాయస్థానాల్లో మొట్టికాయల తర్వాత, మూడు రాజధానుల ప్రతిపాదనని అసెంబ్లీ నుంచి విరమించుకుంది అప్పటి జగన్ సర్కార్.

ఓడిపోయాక.. మాట మార్చిన జగన్..

ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత, అమరావతి విషయంలో వైఎస్ జగన్ మళ్ళీ మాట మార్చారు. అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించాక, దాన్ని జీర్ణించుకోలేక, ‘మావిగన్’ ప్రకటన చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

ఇదొక మూర్ఖత్వం.! రాజధాని అంటే, ఎందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నచ్చడంలేదన్నది ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్. జగన్ ప్రదర్శిస్తున్నది ఉన్మాదం.. అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

Also Read: పవన్ కళ్యాణ్ సినిమాలు వైసీపీని ఎందుకు భయపెడుతున్నాయ్.?

మరోపక్క, ‘ఎద్దు ఈనిందిరా.. అనగానే, దూడని కట్టెయ్..’ అన్న చందాన, జగన్ ‘మావిగన్’ ప్రకటన చేయగానే, ‘రాజధాని మావిగన్’ అంటూ, వైసీపీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు.

ఇదిలా వుంటే, అమరావతి అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేయడం ప్రారంభించింది. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతికి రానున్నాయి.

2029 తర్వాత.. మళ్ళీ మాట మార్చుతాడేమో..

ఈ పరిస్థితుల్లో ‘మావిగన్’ పేరుతో యాగీ చేయడం వైసీపీకి అస్సలు మంచిది కాదని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అర్థమవుతోందో లేదోగానీ.. ‘మావిగన్’ ప్రకటనతో వైసీపీ అదఃపాతాళానికి పడిపోయింది. రాజకీయంగా ఇదొక ఆత్మహత్యా సదృశం లాంటి వ్యవహారమే.

ఇప్పటికి మావిగన్.. 2029 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ ఇంకే నినాదం అందుకుంటారో ఏమో.! నాన్సెన్స్.. ఇదేం రాజకీయం.? ఇదేం మూర్ఖత్వం.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group