Pawan Kalyan Health Mystery.. జన సేనాని, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏం, బానే వున్నారు కదా.? చలాకీగా కనిపిస్తున్నారు కదా.? సినిమాల్లోనూ నటిస్తున్నారు కదా.? అంటే, పైకి పవన్ కళ్యాణ్ ఎలా కనిపిస్తున్నా, ఆయన అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నమాట వాస్తవం.
అనారోగ్య సమస్యలంటే, శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యకు ఇటీవలే ఆయన శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
సమస్య ఎంత తీవ్రమైనదంటే, సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ, సర్జరీ అనంతరం హైద్రాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పరామర్శిచేంత.
అక్కడితో అయిపోలేదు, ఇంకో సమస్య పవన్ కళ్యాణ్‌ని వెంటాడుతోంది. అదే, భుజానికి ఏర్పడ్డ సమస్య. చాలాకాలంగా పవన్ కళ్యాణ్, ఈ సమస్యతో బాధపడుతున్నారు.
వెంటనే సర్జరీ అవసరమని, గతంలోనే పవన్ కళ్యాణ్‌కి వైద్యులు స్పష్టం చేశారు. కానీ, పవన్ కళ్యాణ్ అశ్రద్ధ చేశారు. తాజాగా, పవన్ కళ్యాణ్ ముంబైలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈసారి సర్జరీ ఆలస్యం చేయడం మంచిది కాదని వైద్యులు ఇంకాస్త గట్టిగానే హెచ్చరించారట.
అయినాగానీ, అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాతే, సర్జరీకి వస్తానని పవన్ కళ్యాణ్, వైద్యులకు తెగేసి చెప్పారట.
ఇదే, ఈ మొండితనమే పవన్ కళ్యాణ్ అభిమానులకీ నచ్చడంలేదిప్పుడు. ‘మీరు బావుంటే, మేం బావుంటాం.. అన్నయ్యా..’ అని చెబుతూ, అస్సలు అశ్రద్ధ చేయొద్దని అభిమానులు సూచిస్తున్నారు.
సర్జరీ అనంతరం పవన్ కళ్యాణ్ తిరిగి, సాధారణ విధుల్లోకి ఎప్పుడు వస్తారు.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
శ్వాస సంబంధిత సమస్యకి ఇటీవల సర్జరీ జరిగినప్పుడు, సమస్య తీవ్రత ఎక్కువే అయినా.. వెంటనే అధికారిక వ్యవహారాలు చక్కబెట్టారు పవన్ కళ్యాణ్.
అన్నట్టు, త్వరలో పవన్ కళ్యాణ్ ‘ఓజీ-2’ సినిమా కోసం డేట్స్ కేటాయించనున్న విషయం విదితమే.
సర్జరీ తర్వాత, పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది.? అన్నదానిపై ‘ఓజీ-2’ సినిమా షూటింగ్ వ్యవహారాలు ఆధారపడి వుంటాయి.
ఆరోగ్యమే మహాభాగ్యం.. సో, ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి వుంటుంది పవన్ కళ్యాణ్ అయినా, ఇంకెవరైనా.!
