Pawan Kalyan Telangana Nageswar.. ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఓ గాలి వార్త పోగేసి, ఓ న్యూస్ ఛానల్‌లో దాన్ని వదిలారు.
అది కాస్తా, వివాదాస్పదమయ్యింది. తమ మీద నాగేశ్వర్ చేసిన నిందారోపణలపై జన సేన తీవ్రంగా స్పందించింది. జన సేన శ్రేణులు, నాగేశ్వర్‌పై మండిపడ్డాయి.
దాంతో, తప్పు తెలుసుకున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ తాను జన సేన మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ జన సేన పార్టీకి క్షమాపణ కూడా చెప్పేశారు.. ఇక్కడితో ఈ వివాదాన్ని వదిలెయ్యాలని పేర్కొంటూ.
క్షమించి వదిలేసిన జనసేనాని పవన్ కళ్యాణ్..
పెద్దాయన తెలియక తప్పు చేశారన్న కోణంలో, జన సేన పార్టీ ఆయన చెప్పిన క్షమాపణను ఆహ్వానించింది.
జన సేన శ్రేణులు ఇక్కడితో ఈ వివాదాన్ని వదిలెయ్యాలని, జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా పిలుపునిచ్చారు.
ఇంతలోనే, ఓ మూక ఈ వివాదాన్ని కొత్త మలుపు తిప్పింది. నాగేశ్వర్‌తో కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టింది.
అందులో జర్నలిస్టుల ముసుగేసుకుని కొందరు పెయిడ్ ఆర్టిస్టులు, పవన్ కళ్యాణ్ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
కులాన్నీ,. ప్రాంతాన్నీ.. తెరపైకి తెచ్చి వివాదాస్పదం చేయడమేంటి.?
ఇంకా చిత్రమైన విషమేంటంటే, ఇందులోకి కులాన్నీ, ప్రాంతీయ వాదాన్నీ జొప్పించే ప్రయత్నం చేసింది ఆ మూక.
జన సేన పార్టీ విషయంలో తాను చేసిన తప్పుని తెలుసుకుని, క్షమాపణ కూడా చెప్పిన నాగేశ్వర్, ఈసారి యూ టర్న్ తీసుకున్నారు.
భయపడేది లేదనీ, మాట్లాడుతూనే వుంటానని ప్రకటించేశారు. తనతోపాటు వున్న మూక, పవన్ కళ్యాణ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే, ఎంజాయ్ చేశారు.
దాంతో, జన సేన పార్టీ నుంచి కూడా కౌంటర్ ఎటాక్ తప్పలేదు. తెలంగాణకి జన సేనాని పవన్ కళ్యాణ్ చేసిన సాయం గురించి చెప్పారు తెలంగాణ జన సేన నేతలు.
పవన్ కళ్యాణ్ మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన ‘మూక’లో ఎవరైనా, ఆ స్థాయిలో తెలంగాణకి సాయం చేశారా.? అని జన సేన నేతలు నిలదీశారు.
ఇంతకీ, ఈ మూక వెనుక వున్నదెవరు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారింది. తప్పు చేసి, ఆ తప్పుని ఒప్పుకుని, క్షమాపణ కూడా చెప్పిన నాగేశ్వర్, యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు.?
