Home » ‘పెద్ది’ పంచాయితీ.! జాన్వీ కపూర్ ఇకపై తెలుగు సినిమాలు చేయదా.?

‘పెద్ది’ పంచాయితీ.! జాన్వీ కపూర్ ఇకపై తెలుగు సినిమాలు చేయదా.?

by hellomudra
0 comments
Janhvi Kapoor

Janhvi Kapoor Peddi Tollywood.. ‘పెద్ది’ సినిమా జాన్వీ కపూర్‌కి నటిగా బోల్డంత చెడ్డ పేరుని తీసుకొచ్చింది. విపరీతమైన నెగెటివిటీ ఆమె చుట్టూ కమ్ముకుంది.

అత్యంత దారుణమైన ట్రోలింగ్‌ని ‘పెద్ది’ సినిమాతో జాన్వీ కపూర్ ఎదుర్కొంది… ఆ ట్రోలింగ్ కొనసాగుతూనే వుంది. ఏంటీ, ఇంతకు ముందెప్పుడూ జాన్వీ కపూర్ ఇంతలా తెరపై ఎక్స్‌పోజింగ్ చెయ్యలేదా.?

ఎందుకు చెయ్యలేదు.? చాలానే చేసింది.! కాకపోతే, ‘పెద్ది’ సినిమా విషయంలో ఇంత నెగెటివిటీ, జాన్వీ కపూర్ మీద రావడానికి కారణం, ‘పెయిడ్’ ప్రచారమే.!

కొంతమంది పనిగట్టుకుని, ‘పెద్ది’ సినిమాపై దుష్ప్రచారానికి తెగబడ్డారు. ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ నటనకి వంక పెట్టడానికేమీ లేదు.

దాంతో, జాన్వీ కపూర్ ఎక్స్‌‌పోజింగ్ కోణంలో పెయిడ్ క్యాంపెయిన్ నెగెటివ్‌గా జరిగింది. రామ్ చరణ్ అంటే గిట్టనివారు చేసిన దుష్ప్రచారానికి జాన్వీ కపూర్ బలైపోయిందంతే.

ఓటీటీ వెర్షన్‌లోనూ జాన్వీ కపూర్ సీన్స్‌కి కత్తెర పడ్డాయంటే, ఏ స్థాయిలో ఆమెపై నెగెటివిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ విషయమై చాలా హుందాగా స్పందించాడు.

జాన్వీ కపూర్ పూర్తిగా, ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు దూరమయ్యింది సినిమా విడుదలయ్యాక. సరే, దర్శకుడు ఆమె నటనకు స్కోప్ వున్న పాత్ర డిజైన్ చేయలేకపోయాడన్నది వేరే చర్చ.

‘పెద్ది’ లాంటి సినిమాల్లో బలవంతంగా హీరోయిన్ పాత్రను కమర్షియల్ కోణంలో చొప్పించే ప్రయత్నం చేయడమూ అంత సమర్థనీయం కాదు.

కాకపోతే, ‘పెద్ది’గాడి నాటుతనాన్ని ఎలివేట్ చేసే క్రమంలో, అచ్చియ్యమ్మ పాత్రని అంత గ్లామరస్‌గా డిజైన్ చేయాల్సి వచ్చిందన్నది వేరే వెర్షన్.

ఏది ఏమైనా, ‘పెద్ది’ ఘనవిజయం సాధించింది.. ఇక, ఈ కంటెంట్ విషయమై డిస్కషన్స్ అనవసరం.

కానీ, ఈ ‘పెద్ది’ పంచాయితీ కారణంగా, ఇకపై తెలుగు సినిమాల్లో నటించకూడదని జాన్వీ కపూర్ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం.. అత్యంత హేయం.

జాన్వీ కపూర్‌లో నిఖార్సయిన నటిని వెలికి తీసే సినిమాలు రావాల్సి వుంది. బాలీవుడ్‌లో ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది జాన్వీ కపూర్. ఖచ్చితంగా, మంచి పాత్ర వస్తే జాన్వీ కపూర్ ‘నో’ చెప్పే ఛాన్సే వుండదు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group