Table of Contents
Katrina Kaif Motherhood Trolling.. సమంత గర్భం దాల్చిందట.! ఇంకో హీరోయిన్ పెళ్ళి కాకుండానే తల్లయ్యిందట.! ఈ తరహా గాసిప్స్ నిత్యం వింటూనే వుంటాం.!
సినిమా అంటేనే గ్లామర్ కదా.. గ్లామరస్ గాసిప్స్ కోటాలో ఇలాంటివి సర్వసాధారణమే. కొన్నిటిని చాలా లైట్ తీసుకుంటారు సదరు సెలబ్రిటీలు.
కానీ, కొన్ని గాసిప్స్ సెలబ్రిటీల్ని తీవ్రంగా బాధిస్తాయి. మాతృత్వపు అనుభూతి చాలా గొప్పది. గర్భం దాల్చిన విషయాన్ని ఓ ‘సెలబ్రేషన్’లా అభిమానులతో పంచుకోవాలనుకుంటారు ప్రముఖులు.
అయితే, వాళ్ల ప్రైవసీని దెబ్బ తీస్తుంటారు మీడియా ముసుగులో కొందరు ఎర్నలిస్టులు. మీడియా సంస్థలు మాఫియా తరహాలో వ్యవహరిస్తుంటాయి ఇలాంటి వ్యవహారాల్లో.. అంటారు చాలామంది.
Katrina Kaif Motherhood Trolling.. కత్రినా విషయంలో ఎందుకిలా.?
పెళ్లయ్యాక, తల్లయ్యే క్రమంలో పెరుగుతున్న ‘పొట్ట’కి సంబంధించి, సోషల్ మీడియా వేదికగా ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు హీరోయిన్లు.
వీటిపైనా ట్రోలింగ్ జరుగుతుంటాయి. ‘బరితెగింపు’ అంటారు కొందరు.! కాదు, తమ జీవితంలో అద్భుతమైన ఆ ‘తొమ్మిది నెలల ప్రయాణాన్ని’ అభిమానులతో పంచుకోవడం.. అంటారు ఇంకొందరు.
బిడ్డకు జన్మనిచ్చాక, శరీరం ఇంతకు మునుపులా లేదంటూ జరిగే ట్రోలింగ్ ఇంకో ఎత్తు. కత్రినా కైఫ్ విషయంలో అదే జరుగుతోంది. ఇంతకు ముందు చాలామంది హీరోయిన్లకీ అదే జరిగింది.
‘మల్లీశ్వరి’ సినిమాతో తెలుగు తెరపై తెరంగేట్రం చేసిన కత్రినా కైఫ్, ఆ సినిమాలోని ఆమె నటనకుగాను, డాన్సులకుగాను.. చాలా ట్రోలింగ్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
బెస్ట్ డాన్సర్..
కట్ చేస్తే, ఇండియన్ సినిమా స్క్రీన్ మీద బెస్ట్ డాన్సర్స్ అనదగ్గ ప్రముఖుల లిస్టులో కత్రినా కైఫ్ తనదైన స్థానాన్ని సొంతం చేసుకుంది. దటీజ్ కత్రినా.
ఇప్పుడామె ఓ బిడ్డకు జన్మనిచ్చాక, భారీ శరీరంతో కనిపించడంపై తీవ్రాతి తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్న దరిమిలా, ఏమో.. మళ్ళీ మెరుపు తీగలా తయారై.. అందరికీ షాకివ్వబోతోందేమో.!
మంచి విషయమేంటంటే, ట్రోలింగ్ కంటే ఎక్కువగా ఆమెకు వస్తున్న మద్దతుపై మీడియా కవరేజ్ లభిస్తుండడం. ఔను మరి, బాలీవుడ్ ప్రముఖులే కాదు, టాలీవుడ్ ప్రముఖులూ కత్రినా కైఫ్కి బాసటగా నిలుస్తున్నారు.
మరోపక్క, నెటిజనంలోనూ చాలామంది ‘అమ్మ’తనాన్ని అవమానిస్తే పుట్టగతులుంటాయా.? అని ప్రశ్నిస్తున్నారు. అదీ నిజమే మరి.!
తల్లిగా స్పందించిన సోనారిక బడోరియా..
సినీ నటి సోనారికా బడోరియా సోషల్ మీడియా వేదికగా కత్రినాపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి స్పందించింది. తల్లయ్యే క్రమంలో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటామో సవివరంగా పేర్కొంది.
తెలుగులో పలు సినిమాల్లో నటించిన సోనారికా, పెళ్ళి చేసుకుంది. తల్లయ్యింది. గర్భం దాల్చిన తర్వాత శరీరంలో వచ్చిన మార్పులు, ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల గురించి వివరించింది.
‘ఓ జీవిని మోస్తున్నాం.. ఆ జీవిని భూమ్మీదకి తీసుకొస్తున్నాం.. మా రక్త మాంసాల్ని పంచి, ఓ జీవిని సృష్టిస్తున్నాం..’ అంటూ సోనారిక వ్యాఖ్యానించింది.
తల్లయ్యే ప్రతి మహిళకీ ఈ అనుభవాలుంటాయ్. ఆ తల్లే లేకపోతే, ట్రోలింగ్ చేసే సోకాల్డ్ టైమ్ పాస్ గాళ్ళు అసలు ఈ భూమ్మీదకు వచ్చి వుండేవాళ్ళే కాదు.
గర్భం దాల్చిన నటీమణుల మీద ట్రోలింగ్ గతంలోనూ జరిగింది.. ఇప్పుడూ జరుగుతోంది.. ఇకపైనా జరుగుతుంది. ఇదొక రోగం.! దీనికి చికిత్స లేదు.!
