Riddhi Kumar Ultra Modern Glamour.. అప్పుడెప్పుడో ‘లవర్’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది అందాల భామ రిథి కుమార్.
ఆ తర్వాత ఒకటీ అరా తెలుగు సినిమాలతో పాటూ, మలయాళ, హిందీ, మరాఠీ సినిమాల్లో నటించింది.
ఓటీటీ ప్లాట్ ఫామ్ విషయానికి వస్తే.. మంచి కథా నేపథ్యం వున్న ‘క్యాండీ’, ‘హ్యూమన్’, ‘క్రాష్ కోర్స్’ తదితర సిరీస్‌లలో నటించింది.
వాటిలోల్లో ‘క్రాష్ కోర్స్’ సిరీస్‌కి సంబంధించి రిధ్ధి కుమార్‌కి నటిగా మంచి పేరొచ్చింది.
కోటా కోచింగ్ సెంటర్ల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సిరీస్‌లో విద్యార్ధులపై స్టడీ ప్రెజర్ మరియు మానసిక సంఘర్ణణలు వంటి సున్నితమైన అంశాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.
అలాగే ‘క్యాండీ’ సిరీస్‌తోనూ రిధ్ధి కుమార్ మంచి గుర్తింపు దక్కించుకుంది. బెస్ట్ సపోర్టింగ్ యాక్ష్రెస్ అవార్డు అందుకుంది రిధి ఈ సిరీస్‌తో.
Riddhi Kumar Ultra Modern Glamour.. రెబల్ స్టార్ ప్రబాస్ తాలూకా.!
ప్రబాస్‌తో రెండు సినిమాల్లో నటించింది రిధ్ది కుమార్. మెయిన్ లీడ్ హీరోయిన్ పాత్ర కాకపోయినా.. గ్లోబల్ స్థాయిలో గుర్తింపున్న ప్రబాస్ సరసన రెండు సినిమాల్లో ఛాన్స్ రావడం అంత ఆషామాషీ ముచ్చట కాదు.
‘పూజా హెగ్ధే – ప్రబాస్ కాంబోలో వచ్చిన ‘రాధే శ్యామ్’ సినిమాలోనూ, ప్రబాస్ లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ సినిమాలోనూ రిద్ధి కుమార్ నటించింది.
అప్పటి నుంచీ రిధి.. ‘ప్రబాస్ తాలూకా’ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది కూడా.

ఆ ట్రెండింగ్‌ని యుటిలైజ్ చేసుకోవడానికే నెట్టింట చాలా యాక్టివ్‌గా వుంటోంది రిధ్ధి కుమార్. లేటెస్టుగా రిద్ధి షేర్ చేసిన ఫోటోలు యూత్‌ని ఎట్రాక్ట్ చేస్తున్నాయ్.
క్లాసిక్ బ్లాక్ స్లీవ్‌లెస్ టాప్ మరియు బాడీ సూట్.. ఆ మధ్యలో వున్న మెటాలిక్ గోల్డ్ రింగ్ డిటైలింగ్ మరియు కటౌట్ డిజైనర్ వేర్ రిధ్ది కుమార్ స్టైలింగ్‌కి డిఫరెంట్ చిక్ లుక్ యాడ్ చేశాయ్.
ఈ అల్ట్రా మోడ్రన్ వేర్‌కి వెస్ట్రన్ స్టైల్ సిల్వర్ బకెల్ వున్న బ్లాక్ బెల్ట్ ధరించి టోటల్ అవుట్ ఫిట్‌కి డిఫరెంట్ షేప్ ఇచ్చి సింప్లీ సూపర్బ్‌గా దర్శనమిస్తోంది రిద్ది కుమార్.
కర్టెన్ బ్యాంగ్స్ అండ్ సాప్ట్ లేయర్స్ ఓపెన్ హెయిర్ స్టైల్ రిధి ఫేస్‌కి క్యాజువల్ అండ్ ట్రెండీ వైబ్‌నిస్తుంది.
సిటీ స్కై లైన్ బ్యాక్ డ్రాప్‌లో ఎలాంటి ఆర్టిఫిషియల్ లైటింగ్ జోలకి పోకుండా.. నేచురల్ డే లైట్‌ని యూజ్ చేసుకుని రిధ్ది చేయించుకున్న ఈ సింపుల్ ఫోటో షూట్ ఎక్స్‌లెంట్ అండ్ ఎలిగెంట్.!