Table of Contents
Pawan Kalyan Mark Change.. వైసీపీ, తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌కి హెచ్చరిక జారీ చేసింది. అలానే, టీడీపీ కూడా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని అప్రమత్తం చేసింది.
జన సేనాని, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విడాకులపై ఎక్కడా ఎలాంటి అభ్యంతరకర కామెంట్లు చెయ్యకూడదని టీడీపీ, వైసీపీ.. తమ తమ సోషల్ మీడియా కార్యకర్తల్ని హెచ్చరించాయి.
ఎలా చూసినా, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత అనూహ్య పరిణామమిది. దీన్నొక మంచి మార్పుగా చూడొచ్చేమో.!
పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యల్ని సోషల్ మీడియా వేదికగా చేయడంలో టీడీపీ, వైసీపీ ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి.
చాలాకాలంగా నడుస్తున్న వ్యవహారమిది. కులం తోక లేనిదే రాజకీయం చేయలేని ఆ రెండు పార్టీల సానుభూతిపరులూ, జన సేన పార్టీ మీద ‘కుల మద్ర’ వేస్తుంటాయన్న సంగతి తెలిసిందే.
Pawan Kalyan Mark Change.. పొత్తులో వున్నా…
టీడీపీ – జనసేన.. ఇప్పుడు రాజకీయంగా ‘పొత్తు’లో వున్నాసరే, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో కొందరు, ఇప్పటికీ పవన్ కళ్యాణ్‌ని దూషిస్తూనే వుంటారు.
పవన్ కళ్యాణ్ విడాకులకు సంబంధించి తొలుత సోషల్ మీడియాలో, ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విషయం బయటకు పొక్కాక, ఒక్కసారిగా ఇదొక సంచలనమే అయ్యింది.
అయితే, అంతలోనే.. విషయం మొత్తం చప్పబడిపోయింది. టీడీపీ, వైసీపీకి చెందిన కొందరు, పిచ్చి కూతలు కూస్తే, జనసేన కార్యకర్తలు, ఆ పిచ్చి కూతలకు గట్టిగానే కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.
తెల్లారేసరికి, టీడీపీ అలానే వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి, ‘ఎవరూ స్పందించొద్దు..’ అంటూ ఆదేశాలు రావడంతో, ఆయా పార్టీల సానుభూతిపరులు పూర్తిగా సైలెంటయిపోయారు.
వైసీసీ సైలెన్స్.. ఆశ్చర్యకరమే..
మరోపక్క, అవకాశం దొరికితే, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసే వైసీపీ నాయకులు కొందరు ఈసారి పూర్తిగా సైలెంటయిపోయారు.
‘అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారం. ఆ విషయంపై మాకేమీ ఆసక్తి లేదు.. మేం ఆ విషయంపై స్పందించదలచుకోవడం లేదు’ అనేశారు మీడియా సాక్షిగా.
నిజంగానే, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇదో ఆహ్వానించదగ్గ ‘మార్పు’గా చెప్పుకోవచ్చు.!
మార్పు.. పవన్ కళ్యాణ్ వల్లనే..
ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక, ఏనాడూ పవన్ కళ్యాణ్, గతంలో తనకు జరిగిన దూషణలపై ప్రతీకారం తీర్చుకోవాలనుకోలేదు.
ఆ మాటకొస్తే, పవన్ కళ్యాణ్ ఏనాడూ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు దిగలేదు.
Also Read: సోషల్ మీడియా బానిసత్వం: మనల్ని మనం కాపాడుకుందాం.!
పవన్ కళ్యాణ్ మీద, ఆయన ఇంట్లోని మహిళలపైనా జగన్ దారుణమైన వ్యక్తిగత దూషణలు చేసినా, పవన్ ఎప్పుడూ జగన్ మీదగానీ, జగన్ ఇంట్లో వాళ్ళపైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది లేదు.
మొత్తమ్మీద, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వచ్చిన ఈ మార్పు నిజమైనదే అయితే, ఆహ్వానించదగ్గ పరిణామమే.! ఈ మార్పుకి కారణం ముమ్మాటికీ పవన్ కళ్యాణ్ మాత్రమే.!