Home » మీ ఫేస్ క్రీమ్‌లో పాదరసం వుందా.? కిడ్నీలు చెడిపోతాయ్ జాగ్రత్త.!

మీ ఫేస్ క్రీమ్‌లో పాదరసం వుందా.? కిడ్నీలు చెడిపోతాయ్ జాగ్రత్త.!

by Mudra369 Editorial Desk
0 comments
Face Cream Mercury Kidney Disease

Mercury Face Cream Kidney Failure.. కేరళకి చెందిన పదిహేడేళ్ళ యువతి, తెల్లగా కనిపించేందుకోసం సోషల్ మీడియాలో ఓ ఇన్‌ఫ్లూయెన్సర్ సూచించిన ఫేస్ క్రీమ్‌ని వినియోగించి, ఆసుపత్రి పాలైంది.!

ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. సదరు యువతి కిడ్నీలు పాడవడానికి, ఆ ఫేస్ క్రీమ్‌లోని పాదరసమే కారణమని వైద్యులు నిర్ధారించారు.

చాలా తక్కువ శాతంలో ఫేస్ క్రీముల్లో పాదరసాన్ని వినియోగిస్తారు. కానీ, వేల రెట్లు ఎక్కువ మొత్తంలో పాదరసాన్ని, ఆమె వినియోగించిన ఫేస్ క్రీమ్‌లో గుర్తించారు.

కిడ్నీలు పాడవడానికి కారణాల్ని అన్వేషిస్తున్న క్రమంలో, బాధిత యువతి శరీరంలో అసాధారణ స్థాయిలో పాదరసం వున్నట్లుగా వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో తేలింది.

Mercury Face Cream Kidney Failure.. ఆపరేషన్ సౌందర్య..

‘ఆపరేషన్ సౌందర్య’ పేరుతో కేరళ ప్రభుత్వం, గత కొన్నేళ్ళుగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది. ఫేక్ సౌందర్య ఉత్పత్తులపై ఉక్కుపాదం మోపుతూనే వుంది.

గతంలో, ఓ బేబీ పౌడర్ కారణంగా క్యాన్సర్ వస్తుందని తేలింది. బేబీ పౌడర్‌ని చిన్న పిల్లలకు ఉపయోగించాల్సి వుండగా, మహిళలు జననాంగాల దగ్గర వినియోగిస్తుండడం వల్లే ఈ దుస్థితి దాపురించింది.

ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఆ బ్రాండ్, తొలుత బుకాయించినా.. ఆ తర్వాత తప్పుని అంగీకరించిందనుకోండి.. అది వేరే సంగతి. పెద్దమొత్తంలో పరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది.

అందం మీద మక్కువ వుండడం సహజమే. అదేమీ తప్పు కాదు.! కాకపోతే, అందం పిచ్చిలో పడి, ప్రాణాలు కోల్పోయే దుస్థితిని తెచ్చుకుంటే ఎలా.?

నెగెటివ్ రియాక్షన్స్ ఇస్తున్నా…

చాలామంది రకరకాల సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటారు. అవి, వారి శరీరాలకు సరిపడక.. భయంకరమైన రియాక్షన్స్ బారిన పడుతుంటారు.

అయినాగానీ, అలాంటి వాళ్ళని చూసి కూడా, ఇతరులు మారరు. అదే పెద్ద సమస్య ఇక్కడ.! గత కొంతకాలంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ప్రభావం సాధారణ ప్రజలపై ఎక్కువైపోయింది.

యూ ట్యూబ్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ఇంకో చోటో.. ఎవరో ఏదో చెబితే, దాన్ని వెంటనే వాడెయ్యడం.. ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారిపోయింది.

పైన, కేరళ ఘటనలో జరిగింది అదే.! ప్రభుత్వాలు ఎంత బాధ్యతగా పని చేస్తున్నా, తమ ప్రాణాల మీదకు వస్తున్న ఇలాంటి విషయాలపై ప్రజలూ అప్రమత్తంగా వుండాల్సిందే.

తప్పు ఎక్కడ జరుగుతోంది.?

ఫెయిర్ అండ్ లవ్లీ అనే ఫేస్ క్రీమ్, తన పేరుని గ్లో అండ్ లవ్లీగా మార్చుకుంది. మిల్కీ బ్యూటీ తమన్నా, తన స్కిన్ టోన్ కారణంగా తనను అలా పిలవడం సబబు కాదని తెగేసి చెప్పింది.

అందం, రంగులో వుండదు.. అంటూ ఎంతోమంది సినీ ప్రముఖులు చెబుతూనే వున్నారు. కానీ, ‘రంగు’ని చూసి ‘డిస్క్రిమినేషన్’ అనేది ఇంకా మన సమాజంలో కొనసాగుతూనే వుంది.

ఆత్మవిశ్వాసానికి అందంతో పని లేదని ఓ పక్క చెబుతూనే, అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందనే ప్రకటనలూ.. ఈ తరహా దారుణాలకు కారణవుతున్నాయి.

స్త్రీలు మాత్రమే అందం పట్ల అధిక శ్రద్ధ చూపిస్తారనుకుంటే పొరపాటు.. మగవాళ్ళూ తామేం తక్కువ కాదంటున్నారు, ఫేస్ క్రీమ్స్ వినియోగంలో.

కార్పొరేట్ మాఫియా..

ఇదొక మార్కెటింగ్ జిమ్మిక్కు.. సౌందర్య సాధనాల మార్కెట్ లక్షల కోట్లకు విస్తరించి వుంది ప్రపంచ వ్యాప్తంగా. నిజానికి, దీన్నొక కార్పొరేట్ మాఫియా అనొచ్చేమో. అదే, అన్ని అనర్ధాలకీ కారణం.

మీ టూత్ పేస్టులో ఉప్పు వుందా.? అంటూ ఆ మధ్య ప్రకటనలు వచ్చేవి. ఉప్పు, బీపీని పెంచుతాయ్ కదా.? అన్న కనీస సోయ మనకి లేకుండా పోయింది.

అలానే, మీ టూత్ పేస్టులో బొగ్గు వుందా.? అని కూడా ప్రకటనల్ని చూశాం. ఇలాంటి ప్రకటనల విషయంలోనే, ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరించాలి.

సెలబ్రిటీలు కాసుల కక్కుర్తి కోసం ఇలాంటి ప్రకటనల్లో నటించడం మానేస్తే, కొంతవరకు మార్పు వస్తుందేమో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group