Home » వన్ అండ్ ఓన్లీ క్రికెట్ గాడ్.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.!

వన్ అండ్ ఓన్లీ క్రికెట్ గాడ్.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.!

by hellomudra
0 comments
Sachin Tendulkar

HBD Sachin Tendulkar Mudra369.. ధోనీ అంటే ఇష్టం.. కోహ్లీ అంటే ప్రాణం.. రోహిత్ శర్మకి ఫిదా.. ఇలా చెప్పుకుంటూ పోతే, క్రికెట్ అన్నాక, బోల్డంతమంది స్టార్లకు బోల్డంతమంది డై హార్డ్ ఫ్యాన్స్ వుంటారు.

కానీ, క్రికెట్ అభిమానులందరికీ ‘గాడ్’ అంటే, సచిన్ టెండూల్కర్ మాత్రమే. క్రికెట్‌కి సచిన్ టెండూల్కర్ గుడ్ బై చెప్పేసి, చాలా ఏళ్ళయ్యింది.

దశాబ్దాలు గడుస్తున్నా, సచిన్ టెండూల్కర్ అనే బ్రాండ్ మాత్రం క్రికెట్‌లో ఇంకా అలానే వుంది. దేశంలోనే కాదు, ప్రపంచ క్రికెట్‌లో ఇంకెవరికీ దక్కని గౌరవం సచిన్ టెండూల్కర్‌కి దక్కింది, దక్కుతోంది.

సచిన్ టెండూల్కర్ సాధించిన పరుగులు, సృష్టించిన రికార్డులు.. వీటి గురించి మళ్ళీ కొత్తగా చెప్పుకునేదేముంది.? లెజెండ్ అంతే.!

HBD Sachin Tendulkar Mudra369.. క్రికెట్ వున్నంత కాలం.. ఒక్కడే దేవుడు..

ఇప్పటికీ క్రికెట్ మైదానంలో, సచిన్ అభిమానులు సందడి చేస్తుంటారు. సచిన్ జెర్సీతో కనిపిస్తారు. సచిన్ టెండూల్కర్ పేరుని ఒంటి మీద రాసుకుని మురిసిపోతుంటారు.

దటీజ్ సచిన్ టెండూల్కర్. క్రికెట్‌లో కొత్త షాట్స్ వచ్చేశాయ్. ధోనీ హెలికాప్టర్ షాట్ దగ్గర్నుంచి, హార్దిక్ పాండ్యా లాఫ్టెడ్ సిక్సర్ వరకూ.. ఎవరెంతలా బాదినా, సచిన్ తర్వాతే.

సొగసైన బ్యాటింగ్ అంటే, సచిన్ టెండూల్కర్ మాత్రమే. సచిన్ టెండూల్కర్ అంటే, క్రికెట్‌కి సంబంధించినంతవరకు అదొక డిక్షనరీ.!

Also Read: దెయ్యాల పండగ ‘Halloween’లో మన ‘కొరివి దెయ్యాలు’.!

ఔను, సచిన్ పాత వీడియోల్ని ఇప్పటికీ యంగ్ క్రికెటర్స్ చూస్తుంటారు, ఆ వీడియోల నుంచి ఎంతో నేర్చుకుంటుంటారు. ఏకలవ్యుడి లాంటి శిష్యులు సచిన్ టెండూల్కర్‌కి లెక్కలేనంతమంది వుంటారు.

అందుకే, సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు అంటే, అదో పండగ క్రికెట్ అభిమానులకి. క్రికెట్ వున్నంత కాలం.. సచిన్ టెండూల్కర్ పేరు ప్రస్తావనకి వస్తూనే వుంటుంది.

దటీజ్ సచిన్ టెండూల్కర్.! హ్యాపీ బర్త్ డే మాస్టర్ బ్లాస్టర్.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group