Aisha Sharma Big Hat Glamour.. ఫ్యాషన్ ట్రెండ్స్‌కి బ్రాండ్ అంబాసిడర్ అయిన ముద్దుగుమ్మ ఐషా శర్మ. లేటెస్ట్గా ఈ బ్యూటీ సరికొత్త ఫ్యాషన్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
ఈ సారి పేద్ద టోపీతో గ్లామర్ మ్యాజిక్ చేసేందుకు ముస్తాబైంది ఐషా శర్మ.
వెకేషన్లో భాగంగా ఐషా శర్మ ఈ ట్రెండ్‌లో దర్శనమిచ్చింది. ఫోటోకి పోజిచ్చేందుకు ఏదో ఒక డిఫరెంట్ యాక్సెసరీస్ వుండాలి కదా.!
ఆ యాక్సెసరీస్‌లో భాగంగా పెద్ద హ్యాట్ ధరించింది ఐషా శర్మ. బీచ్ కాన్సెప్ట్‌లో దిగిన ఈ ఫోటో సెషన్‌కి ఈ పేద్ధ హ్యాట్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యింది.
Aisha Sharma Big Hat Glamour.. బీచ్ సోయగాలకు బికినీ సొబగులు.!
సెలబ్రిటీలకు మాల్దీవుల వెకేషన్ చాలా చాలా స్పెషల్. అక్కడి లగ్జరీ బీచ్‌లను, విల్లాస్నీ ఎంజాయ్ చేస్తూ తెగ సంబరపడిపోతుంటారు ముద్దుగుమ్మలు.
నీలి మరియు ఆకుపచ్చ కలగలిపిన వర్ణంలో ఇక్కడి సముద్రపు జలాలు చాలా స్వచ్ఛంగా మెరిసిపోతుంటాయ్.
ఈ అపారమైన సముద్రాన్ని.. అంతులేని ఆకాశం మరింత కవ్విస్తూ.. చూపరుల్లో అదనపు ఉత్సాహం నింపుతుంటుంది.
ఈ సముద్రపు నీటిపై చెక్క స్థంభాల ఆధారంగా నిర్మించిన తెల్లటి లగ్జరీ విల్లాస్ ప్రకృతిలో మమేకపోతాయ్.!
వాటి దగ్గరికి వెళ్లేందుకు నిర్మించిన అందమైన చెక్క వంతెనలు సెలబ్రిటీల ఫోటో ఫ్రేమ్స్‌కి రాయల్ లుక్స్‌ని ఈజీగా తెచ్చిపెట్టేస్తుంటాయ్.
భూతలస్వర్గాల్లో భామల అందాలు.!
ఎటు చూసినా అపారమైన సముద్రం.. స్వచ్ఛమైన ఆకాశం.. అలాగే సూర్య తాపం కూడా చాలా ఎక్కువే. అందుకే అందాల భామ ఐషా శర్మ గొడుగులా వున్న ఇంత పెద్ద హ్యాట్ ధరించింది కాబోలు.
ఈ హ్యాట్ టోటల్ బాడీనే ఎండ తాపం నుంచి కాపాడేలా వుంది. హ్యాట్ సంగతి అటుంచితే.. వైట్ అండ్ వైట్ ట్రాన్స్పరెంట్ బికినీలో ఐషా శర్మ గ్లామర్ వేరే లెవల్ అంతే.
బ్యాక్ గ్రౌండ్ అంతా అందంగా ఎలివేట్ అయ్యేలా ఐషా శర్మ దిగిన పోజులు నెట్టింటిని బీచ్ హీటెక్కిస్తున్నాయ్.
మెడలో సింపుల్ బీడెడ్ నెక్లస్ మరియు చెవులకు చిన్న స్టడ్స్ ధరించి చాలా నేచురల్ మేకప్‌లో ఐషా శర్మ కనిపిస్తోంది ఈ పిక్స్‌లో.
బ్యూటిఫుల్ లొకేషన్ ఓ వైపు.. ఐషా శర్మ బీచ్ స్టైలింగ్ ఇంకో వైపు.. వెరసి ఐషా క్లాసీ లుక్స్ నెట్టింట యమా క్రేజీగా వైరల్ అవుతున్నాయ్.
తెలుసు కదా, ఐషా శర్మ ఎవరో.. ఆమె ఇంకెవరో కాదు, ‘చిరుత’ ఫేం నేహా శర్మకి స్వయానా చెల్లెలు.!