Home » త్రిష.. మరో జయలలిత అవుతుందా.?

త్రిష.. మరో జయలలిత అవుతుందా.?

by Mudra369 Editorial Desk
0 comments
Trisha Krishnan

Trisha To Become Jayalalitha.. తమిళనాట రాజకీయాల్లో జోసెఫ్ విజయ్ ఎంత సంచలనమో, త్రిష కూడా అంతే సంచలనం.! అయినా, త్రిష – విజయ్.. వేర్వేరు కాదు.. అనే భావన కూడా వుంది లెండి.!

కానీ, త్రిష కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తే.! అది కూడా, జోసెఫ్ విజయ్‌కి వ్యతిరేకంగా త్రిష కొత్త రాజకీయ పార్టీ పెడితే.?

ఛ.. ఛ.. ఆ ఛాన్సే లేదంటారు విజయ్ జోసెఫ్ అభిమానులు. కానీ, త్రిష అభిమానుల వ్యవహారం వేరేలా వుంది. ‘పురట్చి తలైవి’ అంటూ, త్రిషని ఏకగా ‘జయలలిత’తో పోల్చేస్తున్నారు.

మొదటి నుంచీ త్రిష పొలిటికల్ స్టైలింగ్, జయలలితని అనుకరిస్తున్నట్లే వుంది. ఆ కట్టూ బొట్టూ.. అంతా ముందు ముందు జయలలితలానే మారిపోనుందనే చర్చ తమిళనాడులో జరుగుతోంది.

నిజమేనా.? త్రిషకి ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి వుందా.? అంటే, ఎవరు మాత్రం ‘పవర్’ మీద ఇష్టం లేకుండా వుండగలరు.?

పైగా, స్నేహితుడు జోసెఫ్ విజయ్‌ని ముఖ్యమంత్రి హోదాలో చాలా దగ్గర్నుంచి చూస్తోంది త్రిష. కొంత అధికార దర్పాన్ని అనధికారికంగా త్రిష కూడా అనుభవిస్తోంది.

త్రిష పేరుతో ఆమె అభిమానులు ఓ సేవా సంస్థ లాంటిదాన్నొకదాన్ని రిజిస్టర్ చేయడం తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ముందు ముందు త్రిష, తమిళనాడు రాష్ట్రానికి జయలలిత మాదిరి నాయకురాలు అవుతుందన్నది సదరు అభిమానుల ఉవాచ.

ఇదేమీ, తమిళనాడు సీఎం జోసెఫ్‌కి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీ కాదనీ, ప్రస్తుతానికి ఇదసలు రాజకీయ పార్టీయే కాదని ఆ అభిమానులు అంటున్నారు.

అభిమాన సంఘాలు తమ అభిమాన నటుల లేదా నటులతో హల్‌చల్ చేయడం సినీ రంగంలో కొత్తేమీ కాదు. కాకపోతే, తమిళనాడులో లెక్కలు వేరే వుంటాయ్.!

ప్రస్తుతం త్రిష, రాజకీయాల్ని చాలా దగ్గర నుంచి గమనిస్తోంది.. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికే ఈ ప్రిపరేషన్ అంతా.. అంటూ, ‘పురట్చి తలైవి త్రిష’ అభిమాన సంఘంపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

నిజానికి, మొన్నటి ఎన్నికల్లోనే త్రిష, టీవీకే పార్టీ నుంచి పోటీ చేస్తుందనీ, ఉప ముఖ్యమంత్రి అవుతుందనీ.. బోల్డన్ని ఊహాగానాల్ని విన్నాం.

కానీ, త్రిష మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుంది. ఎన్నికల ప్రచారంలోనూ ఎక్కడా కనిపించలేదు.

కానీ, తమిళనాడు సీఎగా విజయ్ పదవీ ప్రమాణ స్వీకారం తర్వాత, మళ్ళీ డిప్యూటీ సీఎం త్రిష.. అనే చర్చ షురూ అయ్యింది. రోజులు, నెలలు గడిచిపోతున్నాయ్.. అలాంటిదేమీ జరగలేదు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group