Adipurush Result.. దర్శకుడు ఓం రౌత్ (Om Raut), ‘ఆదిపురుష్’ ప్రభాస్‌కి (Prabhas) ఏదో చూపిస్తున్నాడు.! ఏంటది.?
‘ఆదిపురుష్’ సినిమా కోసం దాదాపు 600 కోట్లు ఖర్చు చేశారట.! నిజమేనా.? అంత ఖర్చు చేస్తే, దాన్నంతా ఎందులో పోసినట్టు.?
వీఎఫ్ఎక్స్ దారుణం.. తెరపై చూస్తున్నది బొమ్మల సినిమానే.! బొమ్మల సినిమా అంటే, తేలిగ్గా తీసుకోవాల్సిన పనిలేదు.
‘అవతార్’ చూశాం కదా.! అదొక విజువల్ వండర్.! మరి, మన రామాయణాన్ని ఇంకెంత అద్భుతంగా తీయగలం.? బాగానే తీసి వుంటారన్న భావనతో, సినిమాకి విపరీతమైన హైప్ ఆడియన్స్ స్వయంగా సృష్టించుకున్నారు.
Adipurush Result.. ఏదో చెప్పాడు.. ఇంకోటేదో చేశాడు.!
కానీ, తొలి ప్రోమో దగ్గర్నుంచి.. సినిమా వరకు.. జస్ట్ కొంత బెటర్మెంట్ అంతే.! ఎక్కడా, ఈ సినిమా వీఎఫ్ఎక్స్ గురించి అంచనాలు పెట్టుకోడానికి లేకుండా పోయింది.

కానీ, రాజమౌళి సినిమాలు చూస్తున్నాం కదా.. అంచనాలు భారీగానే వుంటాయ్. ప్చ్.. ‘ఆదిపురుష్’ నిరాశపర్చింది.
కాదు కాదు, ‘ఆదిపురుష్’ సినిమాతో, రామాయణానికి మకిలి అంటించే ప్రయత్నం జరిగింది. బహుశా ఇంత వరకు ‘రామాయణం’కి ఇంతలా ఎవరూ నెగెటివిటీ తెప్పించి వుండరేమో.!
600 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తే, దాన్ని మురికి కాలువలో ఎలా నిస్సిగ్గుగా పడేయొచ్చో.. ఓం రౌత్ చేసి చూపించేశాడు. ఆ బడ్జెట్ రాజమౌళికి ఇచ్చి వుంటే.?
ప్చ్.. రాజమౌళికి సమీప భవిష్యత్తులో ‘రామాయణం’ చేయాలన్న ఆలోచన రాదేమో.. ఎందుకంటే, ఈ సినిమాతో ఆ ఆలోచన చచ్చిపోయి వుంటుంది.
ప్రచారం కాదు.. ఔట్‌పుట్ ముఖ్యం..
ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం (Adipurush Pre Release Function) నాలుగు కోట్లు ఖర్చు చేశారట.! ఖర్చు చేయడం గొప్ప కాదు.. అంతకు మించి, ఔట్‌పుట్ రాబట్టాలి.!
ఒక్కటి మాత్రం నిజం.. ప్రభాస్ (Prabhas) మోసపోయాడు.. ఓం రౌత్ మోసం చేశాడు.. కాదు కాదు, ‘ఆదిపురుష్’ పేరుతో ప్రేక్షకుల్ని మోసం చేశారు.
Also Read: తమన్నా.! ప్చ్.. ‘బాహుబలి’ సక్సెస్‌ని క్యాష్ చేసుకోలేక.!
అద్భుత రామాయణాన్ని ఇలా తెరకెక్కించి.. యావత్ హిందూ సమాజాన్ని అవమానించారనడం అతిశయోక్తి కాదేమో.!