Table of Contents
Keerthy Suresh Radhika Apte Akka Review.. పితృస్వామ్యం.. మాతృస్వామ్యం.. అని రెండూ వేర్వేరుగా వుంటాయ్. మనది పితృస్వామ్య వ్యవస్థ.! ఒకప్పుడు, మాతృస్వామ్య వ్యవస్థ వుండేదట.!
అలాంటి మాతృస్వామ్య వ్యవస్థకి చెందిన మహిళల మధ్య ఆధిపత్య పోరు ఎలా వుంటుంది.? ఈ కాన్సెప్ట్‌తోనే, స్వాతంత్రం రాకముందు, వచ్చిన తర్వాత.. అంటూ, ‘అక్క’ కథ మొదలవుతుంది.
ఓ ప్రాంతానికి అధినేత్రి ముత్తక్క. ఆమెకు మరో ఇద్దరు సహాయకులు.. వాళ్ళే దుగ్గమ్మ, సుబ్బమ్మ. ఈ ముగ్గురి తర్వాత, అన్ని వ్యవహారాలూ చక్కబెట్టేది భవానీ.
మగాళ్ళ పెత్తనం తమవైపుకు అస్సలు రానీయకుండా, ఈ బృందం అన్ని వ్యవహారాలూ నడుపుతూ వుంటుంది. వీరిది పేర్నూరు ప్రాంతం.!
Keerthy Suresh Radhika Apte Akka Review.. మాతృస్వామ్యం వర్సెస్ పితృస్వామ్యం..
ఆ పేర్నూరులోకి రుద్ర అడుగు పెడుతుంది. మాతృస్వామ్య వ్యవస్థను అంతం చేసి, పితృస్వామ్య వ్యవస్థను తీసుకురావాలన్నది రుద్ర వ్యూహం.
ముత్తక్క సహా, మిగతా ఇద్దరు దుగ్గమ్మ, సుబ్బమ్మ.. తదితరుల్ని చంపుకుంటూ పోతుంది రుద్ర అండ్ టీమ్. మరి, భవానీ ఏం చేస్తుంది.? అంటే, చోద్యం చూస్తుంది.

మొత్తంగా, ముత్తక్క టీమ్‌లో భవానీ మాత్రమే మిగులుతుంది.. ఆ వంశానికి సంబంధించి. భవానీని సైతం అంతమొందించడానికి రుద్ర ప్లాన్ చేస్తుంది.
మరి, భవానీ ఏం చేసింది.? రుద్ర గెలిచిందా.? భవానీ తన వారసత్వాన్ని నిలబెట్టుకుందా.? అన్నది మిగతా కథ.!
Keerthy Suresh Radhika Apte Akka Review.. ఎవరెలా చేశారంటే..
కీర్తి సురేష్ చాలా గంభీరమైన పాత్రలో కనిపించింది. రాజసం ఉట్టిపడే పాత్రలో చాలా తేలిగ్గా చేసుకుపోయింది కీర్తి సురేష్.
కాకపోతే, కీర్తి సురేష్ పాత్రని ఇంకాస్త పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసి వుండాల్సింది. ఓ దశలో రాధికా ఆప్టే, పూర్తి స్థాయిలో కీర్తి సురేష్‌ని డామినేట్ చేసేసిందనిపిస్తుంది.
ఎలా చూసినా, కీర్తి సురేష్‌కి ‘భవానీ’ పాత్ర పరంగా అన్యాయం జరిగిందనే చెప్పాలేమో. తన చుట్టూ అందరూ చనిపోతున్నా, కౌంటర్ ఎటాక్ ఇవ్వలేకపోతుంటుంది మరి భవానీ.
మరోపక్క, రుద్రకి తిరుగుండదు.. ఆమె ఏం అనుకుంటే, అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఆమె చేసే హత్యాకాండకు ఎదురుండదు.
చెలరేగిపోయిన రాధిక ఆప్టే..
హాట్ సీన్స్ విషయంలో రాధికా ఆప్టే షరామామూలుగానే చెలరేగిపోయింది. పెర్ఫామెన్స్ విషయంలోనూ, రాధికకి తిరుగులేదని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు.
కాస్త వేగంగా ఎపిసోడ్స్ జరిగినట్లే అనిపిస్తుంటుంది, అంతలోనే సాగతీత భావనా కలుగుతుంది. కథ రాసుకోవడం, దాన్ని తెరకెక్కించడం.. రెండు విషయాల్లోనూ లోటుపాట్లున్నాయ్.
సినిమాటోగ్రఫీ బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే.! నిర్మాణపు విలవలు బావున్నాయ్. ఎడిటింగ్ సరిగ్గా చేసి వుంటే, సగం నిడివి తగ్గించెయ్యొచ్చేమో.!
మొత్తంగా చూస్తే, ‘అక్క’ సెటప్ బానే వున్నా, అంచనాల్ని మాత్రం అందుకోలేకపోయింది.
కీర్తి సురేష్ నుంచి బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఆశిస్తే, భంగపడతాం. రాధికా ఆప్టే నుంచి ఇంకాస్త హాట్ కంటెంట్ ఆశిస్తే.. అక్కడా నిరాశే మిగులుతుంది.