Table of Contents
బిగ్‌బాస్ (Bigg Boss 3 Telugu) తెలుగు మూడో సీజన్ మరీ రసవత్తరంగా ఏమీ సాగడంలేదు. కానీ, బిగ్‌హౌస్‌లో మాత్రం అనవసర హంగామా మాత్రం రోజురోజుకీ ఎక్కువైపోతోంది. నామినేషన్ ప్రక్రియ (Big Wicket Himaja Punarnavi) ఈసారి కొంచెం డిఫరెంట్‌గా డిజైన్ చేసినా, బకెట్లలోంచి కారే ఆ రంగు నీళ్ళతో (మట్టితో కలిసినవి) నెత్తి మీద చల్లడం.. అనే కాన్సెప్ట్ చూసేవాళ్ళకి ఎబ్బెట్టుగా అనిపించింది.
ఆ సంగతి పక్కన పెడితే, ఈ వారం హౌస్ (Bigg Boss Telugu 3)నుంచి ఎలిమినేట్ అవడానికి మొత్తం ఆరుగురు నామినేట్ అయ్యారు. నిజానికి ఎలిమినేషన్ ప్రక్రియలో ఐదుగురు ఎంపిక కాగా, కెప్టెన్ శివజ్యోతి డైరెక్ట్‌గా వరుణ్ సందేశ్‌ని (Varun Sandesh) నామినేట్ చేయడంతో లిస్ట్ ‘6’కి చేరింది. చిత్రంగా ఇదే శివజ్యోతి, వితికా షెరుని నామినేషన్స్ నుంచి సేవ్ చేయడం గమనార్హం.
Click Here: శ్రీముఖి, హిమజ.. బిగ్‌బాస్ కిలాడీలు.?
వితిక (Vithika Sheru) – రాహుల్ (Rahul Sipligunj) మధ్య ఎలిమినేషన్‌కి సరిసమానంగా ఓట్లు రావడంతో నామినేషన్ ప్రక్రియలో శివజ్యోతి అండతో వితిక బయటపడింది. ఇదిలా వుంటే, ఈసారి అనూహ్యంగా రవికి ఎక్కువ మైనస్ ఓట్లు పడ్డాయి నామినేషన్‌లో. రాహుల్ సిప్లిగంజ్‌కి నామినేషన్స్ అలవాటైపోయాయి.
పునర్నవి ఒక్క వారం తప్పించుకుందిగానీ, మళ్ళీ ఎలిమినేషన్‌లోకి వచ్చేసింది. హిమజ ఈసారి టఫ్ ఫైట్‌ని ఎదుర్కోవాల్సి వుంటుంది. మహేష్ విట్టా (Mahesh Vitta) కూడా నామినేషన్‌లో నిలిచాడు. ఇదిలా వుంటే, ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరో కాదు, హిమజ అన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి గత వారమే హిమజ (Himaja) ఔట్ కావాల్సి వుండగా, అషు రెడ్డిని బలి చేశారన్న వాదనలు తెరపైకొస్తున్నాయి.
Click Here: బిగ్ స్కెచ్.. శ్రీముఖి గ్లామర్ బీభత్సం.!
మరోపక్క పునర్నవి మెడ మీద కూడా ఎలిమినేషన్ కత్తి వేలాడుతోందన్నది మెజార్టీ నెటిజన్స్ అభిప్రాయం. మరోపక్క, బిగ్‌హౌస్‌లోకి వీక్లీ న్యూస్ పేపర్ వచ్చి పడింది. అందులో బిగ్‌హౌస్ విశేషాల్ని గాసిప్స్ రూపంలో పొందు పరిచారు. శ్రీముఖి సహా, దాదాపు అందరి గురించీ గాసిప్స్ వున్నాయందులో.
మరీ ముఖ్యంగా పునర్నవి – రాహుల్ సిప్లిగంజ్ మధ్య కెమిస్ట్రీ గురించి వచ్చిన గాసిప్‌ని హైలైట్‌గా చెప్పుకోవచ్చు. బిగ్‌బాస్‌పై క్యూరియాసిటీ జనంలో పెంచడానికి దీన్నో ఎత్తుగడగా చెప్పుకోవచ్చు. హౌస్‌మేట్స్ పండగ చేసుకున్నారుగానీ, ఇదేమంత ఇంట్రెస్టింగ్‌గా అన్పించలేదు బిగ్‌బాస్ చూసేవాళ్ళకి. కాగా, బిగ్‌హౌస్‌లో బాబా భాస్కర్ – శ్రీముఖి సరదాగా ‘బస్తీ మే సవాల్’ అనుకున్నారు.
Click Here: పునర్నవి బిగ్ అండ్ పెర్‌ఫెక్ట్ ప్లానింగ్.!
రాహుల్ – శ్రీముఖిలను (Rahul Sipligunj Sree Mukhi) విడదీసేందుకు బాబా భాస్కర్ (Baba Bhaskar) సరదాగా ఫన్ జనరేట్ చేశాడుగానీ, అదో కన్నింగ్ ట్రాక్‌గా జనానికి అనిపిస్తోంది. చిత్రంగా ఈ సారి నామినేషన్స్ నుంచి రాహుల్‌కి శ్రీముఖి నుంచి సాఫ్ట్‌కార్నర్ లభించడం గమనార్హం.