మెగాస్టార్ చిరంజీవి.. వయసు మీద పడ్తున్న కొద్దీ ఆయన మరింతగా యువకుడైపోతుంటారు. వయసు శరీరానికే, మనసుకు కాదని చాలామంది చెబుతుంటారు, అతి కొద్ది మంది ప్రూవ్ చేస్తుంటారు.. వారిలో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi The Silver Screen Acharya) పేరు టాప్ ప్లేస్‌లో వుంటుందేమో.
ఆయన డాన్సులకు వయసుని లింకు పెట్టలేం.. ఎందుకంటే, మెగస్టార్ డాన్సుల ముందు, ఆయన వయసు చిన్నబోతుంటుంది. ఆయన ఆలోచనలైతే, అత్యంత వేగంగా పరుగులు పెడుతుంటాయి. మెగాస్టార్ చిరంజీవి.. ఆ పేరులో వున్న వైబ్రేషన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
దాదాపు 9 ఏళ్ళ విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా చేస్తే, ‘బాస్ ఈజ్ బ్యాక్’ అని చాలామంది అన్నారుగానీ.. ఆయన ఎక్కడా ఆ గ్యాప్ తీసుకున్నట్లు కనిపించలేదు.. జస్ట్ అలా తన లెగసీని కొనసాగిస్తున్నారంతే.
ఇక, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఓ అప్‌డేట్‌ని మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టయిల్లో ఇచ్చేశారు. ‘కొరటాల శివతో సీరియస్‌గా ఓ విషయం చర్చించబోతున్నాను..’ అంటూ ఉదయం ట్వీటేసిన చిరంజీవి, సాయంత్రానికి ఓ మీమ్ విడుదల చేశారు సోషల్ మీడియాలో.
ఆ మీమ్ సారాంశమేంటంటే, సినిమా టీజర్ ఎప్పుడు.? అని కొరటాల శివని ప్రశ్నించడం, కొరటాల శివ నుంచి సమాధానాన్ని చిరంజీవి రాబట్టడం. ‘ఏమయ్యా కొరటాల.. ఆచార్య టీజర్ న్యూ ఇయర్‌కి లేదు.. సంక్రాంతికి లేదు, ఇంకెప్పుడు.?’ అని చిరంజీవి ప్రశ్నిస్తే, ‘సర్, అదే పనిలో వున్నా..’ అని కొరటాల శివ సమాధానమిచ్చాడు.
‘ఎప్పుడో చెప్పకపోతే, లీక్ చెయ్యడానికి రెడీగా వున్నా’ అని చిరంజీవి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘రేపు మార్నింగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేస్తా సర్’ అని కొరటాల చెప్పాడు. ‘ఇస్తావ్ గా’ అని చిరంజీవి కన్ఫర్మేషన్ కోసం అడిగితే, ‘అనౌన్స్‌మెంట్ రేపు ఉదయం 10 గంటలకు ఫిక్స్ సర్’ అని ఖచ్చితంగా చెప్పేశాడు కొరటాల.
సో, రేపు.. అంటే, జనవరి 27న ‘ఆచార్య’ (Mega Star Chiranjeevi The Silver Screen Acharya) టీజర్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ రాబోతోందన్నమాట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. చరణ్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.