Deepthi Shannu Love Story.. విన్నారా.? దీప్తి, షన్నూ మధ్య బ్రేకప్ అయిపోయిందట. అరెరే.. సూర్యుడు తూర్పున కాకుండా, పడమర ఉదయిస్తాడేమో. ఆగండాగండి.. ఏంటా తొందర.? ఎందుకంత విపరీతమైన ఆలోచన.. కలిసి యూ ట్యూబ్ వీడియోలు చేశారు.
తొలుత స్నేహం, ఆ తర్వాత ప్రేమ.. అన్ని కథలూ కంచికి చేరవు. అన్ని ప్రేమ కథలూ పెళ్లి పీటల దాకా వెళ్లవు. పరమ రొటీన్ బ్రేకప్పు కహానీ. అంతకు మించి బ్రేకింగ్ న్యూస్ అయ్యేంత సీను లేని వ్యవహారం. అక్కడికేదో ప్రపంచమే తారు మారు అయిపోయేంతలా తెలుగు మీడియా ఓవరాక్షన్ చేసేసింది.
Deepthi Shannu Love Story.. ఈ గోలేంటి.?
బిగ్ బాస్ సెలబ్రిటీలు కదా.. ఆ మాత్రం హంగామా ఈ బ్రేకప్పు మీద చేస్తే టీఆర్‌పీ రేటింగులు పెరుగుతాయని న్యూస్ ఛానళ్లు కక్కుర్తి పడ్డాయేమో. మరీ కామెడీ స్కిట్‌లా తయారైంది మీడియా తీరు.
సుధీర్, రష్మి పెళ్లెప్పుడు.? అంటూ ఏళ్ల తరబడి రచ్చ నడుస్తూనే వుంది. తమ మధ్య ఏమీ లేదనీ, కామెడీ కోసమే స్టేజ్ మీద కెమిస్ర్టీ అని.. ఇద్దరూ ఎన్ని సార్లు చెప్పినా, దాని చుట్టూ జబర్దస్త్ కథలు అల్లబడుతూనే ఉన్నాయ్.

వర్ష, ఇమ్మాన్యుయేల్ మధ్య కూడా ఇలాంటి కామెడీ కథే నడుస్తోంది. ప్రేమ అనేది ఇద్దరి వ్యక్తులకు సంబంధించింది. అదొక మధురమైన అనుభూతి. దాన్ని కూడా దిగజార్చేస్తున్నాయ్ ఈ పబ్లిసిటీ స్టంట్లు. డబ్బులిచ్చి గాసిప్పులు రాయించుకునే స్థాయికి దిగజారిపోయిన సెలబ్రిటీలెందరో.
వారెవ్వా.. వాళ్ళ ప్రేమ.. ప్రపంచ సమస్య.?
పొదల చాటున కక్కుర్తిగాళ్లు చేసే తప్పుడు యవ్వారాలు వార్తలుగా మార్చేసే స్థాయికి మీడియా దిగజారిపోయి, ఎన్నో ఏళ్లయ్యింది. వార్తకీ, విశ్లేషణకీ, కథనానికీ అర్ధం తెలియని స్థాయికి జర్నలిజం పతనమైపోయింది. బ్రేకింగ్ న్యూస్ అర్ధమే మారిపోయింది.
Also Read: టాలీవుడ్ రివ్యూ: మూవీ ఆఫ్ ది ఇయర్ 2021
ఇప్పుడర్దమైందా.? మీడియా ఓవరాక్షన్ తప్ప.. దీప్తి, షన్నూ బ్రేకప్పులో చర్చించుకోవల్సిన మేటర్ లేదనీ, మధ్యలోకి సిరి పేరును తీసుకొచ్చి, ఆమె క్యారెక్టర్ దెబ్బ తీయడం, ఆమెవల్లే వీరిద్దరి మధ్యా ప్రేమ (Deepthi Shannu Love Story) బెడిసికొట్టిందని చెప్పడం ద్వారా వీళ్ల స్థాయి దిగజార్చడం.. వారెవ్వా.!
ఈ స్ర్కీన్‌ప్లే న భూతో న భవిష్యతి. అసలిలాంటి ఐడియాలు ఎలా వస్తాయో.!