Ernalist Kantham Tegulu Media.. ఆయనో జర్నలిస్టు.! పేరేమో కాంతమ్.! పేరుకే జర్నలిస్టుగానీ, అసలు గుర్తింపు ‘ఎర్నలిస్ట్’.! జర్నలిజంలో వందల కోట్లు, వేల కోట్లు వెనకేయొచ్చని ఆల్రెడీ చాలామంది నిరూపించేశారు.
ఆ లిస్టులో ఈ ఎర్నలిస్టు కాంతమ్ కూడా చేరిపోయాడు.! తెలుగు రాష్ట్రాల్లోని ఒకప్పటి రూలింగ్ పార్టీలకు ‘భజన’ చేయడం ద్వారా, పాత్రికేయ వృత్తికి పాతరేసిన ఎర్నలిస్ట్ కాంతమ్, అందుకుగాను, బాగానే దండుకున్నాడుట.!
వంద కోట్లు.. కాదు, వందల కోట్లు.. అని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా, ఆయనగారికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపిందన్నది హాట్ టాపిక్.
Ernalist Kantham Tegulu Media.. నవ్విపోదురుగాక నీకేటి సిగ్గు.?
తన మీద దుష్ప్రచారం జరుగుతోందనీ, వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదనీ, తప్పుడు వార్తల్ని ప్రచారంలోకి తెస్తున్నవారిపై న్యాయపోరాటం చేస్తాననీ, ఎర్నలిస్ట్ కాంతమ్, సోషల్ మీడియా వేదికగా అల్టిమేటం జారీ చేసేశాడు.
ఆపు బే.. ఆంబోతు నాయాల… అంటోంది సోషల్ మీడియా.! అంతే మరి, లేకపోతే.. మీడియా ముసుగులో వందలు.. వేలు కాదు, లక్షల్లో దుష్ప్రచారాలు చేసి వుంటాడు మన కాంతమ్.!
పాత్రికేయం అంటే.. బహు చక్కటి వ్యాపారమిప్పుడు.! నెత్తుటి కూడుకి అలవాటుపడ్డ ఎర్నలిస్టులు.. పాత్రికేయ వ్యభిచారం చేస్తున్నారు..
Mudra369
ఫలానా హీరోయిన్, ఫలానా హీరో వల్ల గర్భవతి అట కదా.? ఫలానా రాజకీయ నాయకుడి న్యూ..డ్ క్లిప్ లీక్ అయ్యిందట కదా..! ఇలాంటి గాసిప్పుల్ని ఎర్నలిస్టు కాంతమ్ తన కెరీర్‌లో ఎన్నో ఎన్నో ప్రచారం చేసి వుంటాడు కదా మరి.?
నువ్వు చేస్తే పాత్రికేయమా.? ఇంకెవడన్నా చేస్తే అది దుష్ప్రచారమా.? ఏంటి కాంతమ్ ఈ పద్దతి.! నలుగురూ నవ్విపోదురుగాక నీకేటి సిగ్గు.?
పాత్రికేయమంటే అమ్ముడుపోవడం కాదు కాంతమ్.!
పాత్రికేయమంటే, ఓ రాజకీయ పార్టీకి బాకా ఊదడం కాదు.! డబ్బులకి అమ్ముడుపోవడం అసలే కాదు.! అదో పవిత్రమైన బాధ్యత.! కానీ, ఇప్పుడు మీడియా ఎలా వుంది.?
హేయం, అత్యంత హేయం.! మీడియాని అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజార్చేశారు ఈ సరికొత్త ఎర్నలిస్టులు.
రాజకీయాలకు అమ్ముడుపోయాక.. అది మీడియా ఎలా అవుతుంది.? దాన్ని మీడియా అనకూడదు.. పొలిటికల్ మాఫియా అనాలి.!
Mudra369
దురదృష్టవశాత్తూ ‘కాంతమ్’ లాంటి ఎర్నలిస్టులు, మీడియాలోకి వచ్చేసి, పవిత్రమైన పాత్రికేయాన్ని సర్వనాశనం చేసేందుకు శక్తివంచన లేకుండా చేస్తున్నారు.
ఎర్నలిస్ట్ కాంతమ్ లాంటోళ్ళు, పాత్రికేయానికి పట్టిన చీడపురుగు.. నయం చేయడానికి వీల్లేని క్యాన్సర్.! ఇంతకీ, ఎంత నెత్తుటి కూడు తిన్నావ్ నీ ఎర్నలిజం కెరీర్‌లో మిస్టర్ కాంతమ్.?