Home » మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే, ఇంకో ఐదేళ్ళు అలవాటైపోతుంది.!

మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే, ఇంకో ఐదేళ్ళు అలవాటైపోతుంది.!

by hellomudra
0 comments
Ys Jagan Mavigun

Ys Jagan Pulivendula Tour.. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చాన్నాళ్ళ తర్వాత సొంత నియోజకవర్గానికి వెళ్ళారు.

పులివెందుల నియోజకవర్గ ప్రజలేమో, తమ సమస్యల్ని తమ ప్రజా ప్రతినిథితో చెప్పుకున్నారు.

ఓ మహిళ, తన కష్టాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చెప్పుకుంటే, ‘రెండేళ్ళయిపోయింది, మూడేళ్ళు కళ్ళు మూసుకో..’మని చెప్పారు.

అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్దేశ్యం, మూడేళ్ళ తర్వాత ఎన్నికలొస్తాయి, ఆ ఎన్నికల్లో గెలిస్తే, అప్పుడు సమస్యని పరిష్కరిస్తాం.. అని చెప్పడం కాబోలు.

కానీ, ఈ మూడేళ్ళు.. సదరు మహిళ కష్టం అలానే వుండాలా.? ఇదే ప్రశ్న, బాధితురాలి కుటుంబ సభ్యులని వెంటాడింది.

Ys Jagan Pulivendula Tour.. మూడేళ్ళు ఎక్కడుండాలి.?

‘ఈ మూడేళ్ళూ ఎక్కడుండాల.?’ అంటూ అట్నుంచి ప్రశ్న వచ్చింది అటువైపు నుంచి ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.

గత కొన్నాళ్ళుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు ఎవరు ఏ సమస్యను తీసుకెళ్ళినా, ‘కళ్ళు మూసుకుంటే, ఏళ్ళు గడిచిపోతాయ్..’ అనే చెబుతున్నారు.

2024 ఎన్నికల్లో ఓడిపోయింది మొదలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే ‘కళ్ళు మూసుకుంటే..’ అన్న మాటని పదే పదే వాడేస్తున్నారు, విచ్చలవిడిగా.

ఈ నేపథ్యంలో, ‘మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే.. అదే అలవాటైపోతుంది. మూడేళ్ళ తర్వాత ఇంకో ఐదేళ్ళు కూడా కళ్ళు మూసుకోవాల్సిందే..’ అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లోనే జరుగుతోంది.

Also Read: స్టాండప్ ఉన్మాదం.! పాత్రధారులు దొరికారు.. ‘కుట్ర’దారులెక్కడ.?

నాయకుడంటే, ప్రజల తరఫున నిలబడాలి. వారానికోసారి బెంగళూరు నుంచి రాష్ట్రానికి రావడం, హడావిడి చేయడం.. ఇంతే జరుగుతోంది గత కొన్నాళ్ళుగా వైఎస్ జగన్ విషయంలో.

మూడు నెలలకో, ఆరు నెలలకో ఓ సారి మాత్రమే సొంత నియోజకవర్గం పులివెందులకు వైఎస్ జగన్ వెళుతున్న సంగతి తెలిసిందే.

ప్రతిపక్ష నేత అనే హోదా కోరుకుంటున్న వైఎస్ జగన్, ముందైతే పులివెందుల ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి హాజరవ్వాలి కదా.? ప్చ్.. అసెంబ్లీ అంటేనే వైఎస్ జగన్ భయపడుతున్నారాయె.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group