Home » ఇలియానా.. మరీ ఇంత దారుణంగానా.!

ఇలియానా.. మరీ ఇంత దారుణంగానా.!

by hellomudra
0 comments

హాట్‌ బ్యూటీ ఇలియానాకి ఒక్కసారిగా జ్ఞానోదయం అయ్యింది. గతంలో తన శరీరం (Ileana D Cruz About Her Physique) గురించి తాను బాధపడ్డ విషయాల్ని ఇప్పుడు తీరిగ్గా సోషల్‌ మీడియా వేదికగా నెమరు వేసుకుంది.

తన ఫిగర్‌ సరిగ్గా లేదనీ, తన ముక్కు సరిగ్గా లేదనీ, తన కొలతలు సరిగ్గా లేవనీ.. ‘హిప్స్‌’ నుంచి, ‘బూబ్స్‌ (వక్షోజాలు)’ వరకు అన్ని విషయాల్నీ నిర్మొహమాటంగా ప్రస్తావించేసింది అందాల భామ ఇలియానా. నిజానికి ఇలాంటి అంగాంగ వర్ణన ఇప్పటిదాకా ఏ హీరోయిన్‌ తనకు తానుగా చేసుకోలేదేమో.!

“I’ve always worried about how I looked. I’ve worried my hips are too wide, my thighs too wobbly, my waist not narrow enough, my tummy not flat enough, my boobs not big enough, my butt too big, my arms too jiggly, nose not straight enough, lips not full enough…..
I’ve worried that I’m not tall enough, not pretty enough, not funny enough, not smart enough, not “perfect” enough.

Not realising I was never meant to be perfect. I was meant to be beautifully flawed.
Different.
Quirky.
Unique.
Every scar, every bump, every “flaw” just made me, me.
My own kind of beautiful.

That’s why I’ve stopped. Stopped trying to conform to the world’s ideals of what’s meant to be beautiful.
I’ve stopped trying so hard to fit in. Why should I?? When I was born to stand out.”

అసలేమయ్యింది ఇలియానాకి.? ఏమో, ఇదే ఇప్పుడు ఎవరికీ అర్థం కావడంలేదు. అయినా, ఇలియానా బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే, ఆమె ఆ ఫిజిక్‌తోనే ఎన్నో సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఆ ఫిజిక్‌ కారణంగానే గ్లామరస్‌ హీరోయిన్‌గా తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది.

ఇప్పుడు అవకాశాలు తగ్గాయనేమో.. తన ఫిజిక్‌ సరిగ్గా లేదన్న విషయాన్ని ఇలియానా (Ileana D Cruz) గుర్తు చేసుకుంటోంది. ఆమెకి అన్నీ అలా ‘మైనస్‌ పాయింట్స్‌’గా ఇప్పుడు కనిపిస్తున్నాయేమోగానీ, ఆమెని అభిమానించినవారెవరూ ‘ఆ మైనస్‌లను’ పెద్దగా పట్టించుకోలేదు.

పట్టించుకుని వుంటే, తెలుగుతోపాటు తమిళ, హిందీ సినీ పరిశ్రమలో ఇలియానా హీరోయిన్‌గా ఇంతటి గుర్తింపు తెచ్చుకునేది కాదేమో. ఏదిఏమైనా, ఇలియానా (Ileana D Cruz About Her Physique) చేసిన ఈ ఇన్‌స్టా పోస్ట్‌.. ఆమెకి బోల్డంత పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ పాపులారిటీ రావాలనే కదా, ఇంతటి ‘బోల్డ్‌’ స్టేట్‌మెంట్‌ని ఇచ్చేసింది. వావ్‌.. ఇలియానా తెలివికి హేట్సాఫ్‌ చెప్పాల్సిందే ఎవరైనా.!

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group