Jagan Sharmila Dirty Politics రాజకీయం ఏమైనా చేయగలదు.! అన్నా చెల్లెళ్ళనీ విడదీయగలదు.! ఇదిగో, ఇదే సాక్ష్యం. అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ పార్టీలో.. చెల్లెలు వైఎస్ షర్మిల రెడ్డి ఇంకో పార్టీలో.!
ఆగండాగండీ, ఆమె వైఎస్ షర్మిల రెడ్డి కాదు.. మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.! అలాగని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుచరగణం (వైసీపీ నేతలు) తీర్మానించేశారు.
పెళ్ళయ్యాక, ఇంటి పేరు మారిపోతుంది కాబట్టి, షర్మిల ఎలా ‘రెడ్డి’ అవుతుంది.? ‘శాస్త్రి’ అవుతుందిగానీ.. అని వైసీపీ నేతలు చాలామంది నినదించారు.
తోడబుట్టిన అన్న కదా.. షర్మిలను వెనకేసుకుని వచ్చి వుండాలి. రాజకీయం వేరు, వ్యక్తిగత విమర్శలు వేరని.. పార్టీ ముఖ్య నేతల్ని మందలించి వుండాలి.
Jagan Sharmila Dirty Politics.. చెల్లెలు షర్మిల విషయంలో ఎందుకలా.?
కానీ, వైఎస్ జగన్ అలా చేయలేదు. పచ్చ చీర కట్టుకుని, టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గరకు వెళ్ళిందంటూ వైఎస్ జగన్ కూడా గతంలో దారుణ విమర్శలు చేశారు.
5 ఏళ్లు బీజేపితో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు…ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం.
Ys Sharmila
తన అన్న తనను ఇలా అవమానించడంపై షర్మల అప్పట్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కంటతడి కూడా పెట్టారు వైఎస్ షర్మిల రెడ్డి.
అది గతం. తాజాగా షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోషల్ మీడియ వేదికగా ఘాటైన ప్రశ్నల్ని సంధించారు. అదీ రాజకీయ కోణంలో.
వైఎస్ షర్మిల ప్రశ్నాస్త్రం..
‘‘కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ గారు… మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి ? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..?’’ అని ప్రశ్నించారామె.
అంతే కాదు, ‘‘5 ఏళ్లు బీజేపితో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు…ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం. క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా?’’ అంటూ ప్రశ్నాస్త్రాలు సందించారు.

‘‘YSR వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి వచ్చిందా సంఘీభావం? మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్పా…రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. సిద్దం అన్న వాళ్లకు 11మంది భలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు?’’ అంటూ నిలదీశారు వైఎస్ షర్మిల.
ఇవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఏపీసీసీ అధ్యక్షురాలి హోదాలో వైఎస్ షర్మిలా రెడ్డి సంధించిన ప్రశ్నాస్త్రాలే.
Also Read: వైకల్యానికి కోటా ఎందుకని ప్రశ్నించినందుకే ఆమెని రక్కేస్తారా?
రాజకీయాలన్నాక విమర్శలు సహజం. ఈ క్రమంలోనే రాజకీయ వ్యభిచారం, రాజకీయ అక్రమ సంబంధాలు.. వంటి ప్రస్తావనల్ని రాజకీయ విమర్శల్లో చూస్తున్నాం.
బీజేపీతో అక్రమ సంబంధం.. అంటూ వైఎస్ జగన్‌ని షర్మిల విమర్శించడంపై.. వైసీపీ శ్రేణులు గుస్సా అవుతున్నాయి. తమ అధికార భాష అయిన బూతుల భాషలో షర్మిలని తూలనాడుతున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.