Udhayanidhi Trisha Kaveri Water.. నోటి దూలకి మందు లేదు.! ఈ మాట తరచూ ప్రస్తావనలోకి వస్తుంటుంది.! ఎందుకంటే, నోటి దూల అంత ప్రమాదకరమైనది కాబట్టి.!
ఎంత ఎదిగితే మాత్రం ఏం లాభం.? నోటి దూల ఎంతటి వ్యక్తినైనా అదఃపాతాళానికి తొక్కేస్తుంది.! తన నోటి దూలే, తనకు శతృవు.. అని ఎంతమంది చెప్పినా, కొందరు వినరు.
ఆ లిస్టులో తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు ప్రతిపక్ష నేత, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ పేరు ముందు వరుసలో వుంటుంది.
సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం.. అంటూ, కొన్నాళ్ళ క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఉదయనిధి స్టాలిన్.! ఈ విషయమై పెద్ద రచ్చే జరిగింది.
తండ్రి స్టాలిన్ నుంచి రాజకీయ వారసత్వాన్ని అందుకున్న ఉదయనిధి, చాలా తేలిగ్గానే చట్ట సభలకు వెళ్ళాడు. ఉప ముఖ్యమంత్రి కూడా దక్కించుకున్నాడు.
Udhayanidhi Trisha Kaveri Water.. ప్రతిపక్ష నేతకి బాధ్యత వుండక్కర్లేదా.?
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటిదాకా ముఖ్యమంత్రి పదవిలో వున్న స్టాలిన్ కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.
తండ్రి స్టాలిన్ ఓడిపోవడం, ఉదయనిధికి కలిసొచ్చి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయ్యాడు. ప్రతిపక్ష నేత అన్నాక, రాజకీయ విమర్శలు చేయాలి కదా.!
ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మీద తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఉదయనిధి. అదీ, కావేరీ జలాల ప్రస్తావన తెస్తూ, డబుల్ మీనింగ్ డైలాగులు చెబుతూ.
దారుణమైన విషయమేంటంటే, త్రిష పేరుని ప్రస్తావించకుండా, పరోక్షంగా ఆమెని విజయ్‌కి ముడిపెడుతూ, కావేరీ జలాలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు ఉదయనిధి స్టాలిన్.
ఇంకేముంది.? కేసులు నమోదయ్యాయి.. వెంటనే, ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ కూడా జరిగిపోయింది. తానెవరి పేరూ ప్రస్తావించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని ఉదయనిధి బుకాయిస్తున్నాడిప్పుడు.!
నోటి దూలకి మందు లేదు.!
ఔను, నోటి దూలకి మందు లేదు.! నిజానికి, ‘నోటి దూల’ అనే మాట అన్ పార్లమెంటరీ పదమే.! కానీ, ఉదయనిధి స్టాలిన్ విషయంలో ఆ పద ప్రస్తావనలో అసభ్యకరమేమీ లేదు.!
సినీ నటి త్రిషకి, సినీ నటుడిగా విజయ్ అత్యంత సన్నిహితుడు. విజయ్ రాజకీయ ప్రయాణంలో త్రిషది కీలక పాత్ర అనే ప్రచారం జరుగుతోంది.
టీవీకే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌కి తెరవెనుకాల మద్దతిచ్చింది త్రిష. అయితే, ఎన్నికల ప్రచారంలో మాత్రం త్రిష ఎక్కడా కనిపించలేదు.
అయినప్పటికీ కూడా, త్రిషపై రాజకీయ విమర్శలు వస్తూనే వున్నాయి. తనపై రాజకీయ విమర్శలు చేసినవారికి త్రిష లీగల్ నోటీసులు పంపిస్తుండడం తెలిసిన విషయమే.
అయితే, త్రిష మీద రాజకీయ విమర్శల నేపథ్యంలో ఓ ఎమ్మెల్యే, పైగా ప్రతిపక్ష నేత ఉదయ నిధి స్టాలిన్ అరెస్టవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
