Mrunal Thakur Deepfake.. ‘కోర్టులో కలుద్దాం.. సిద్ధంగా వుండు’ అంటూ అల్టిమేటం జారీ చేసింది సినీ నటి మృణాల్ ఠాకూర్.. తనపై ‘డీప్ ఫేక్’ ఫొటోలు, వీడియోలు చేస్తున్నవారికి.
కొన్నాళ్ళ క్రితం సినీ నటి రష్మిక మండన్న కూడా ‘డీప్ ఫేక్’ వ్యవహారంపై పోలీసుల్ని ఆశ్రయించిన విషయం విదితమే.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సోషల్ మీడియా వేదికగా విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చేయడంతో, చెలరేగిపోతున్నారు కొందరు.
మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ఈ డీప్ ఫేక్ మహమ్మారి బారిన పడ్డారు. కొందరు కోర్టుకు వెళ్ళారు.. తమకు వ్యతిరేకంగా వచ్చే డీప్ ఫేక్ వీడియోలపై చర్యలకు ఉపక్రమించారు.
Mrunal Thakur Deepfake.. మృణాల్ ఠాకూర్ అల్టిమేటం..
తాజాగా ఈ లిస్టులోకి మృణాల్ ఠాకూర్ కూడా చేరింది. సోషల్ మీడియా వేదికగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. వున్నపళంగా డీప్ ఫేక్ కంటెంట్‌ని తొలగించాలని అల్టిమేటం ఇచ్చింది.
తొలగిస్తే సరే సరి.. లేదంటే, చట్టపరమైన చర్యలు తప్పవు. కొత్తగా డీప్ ఫేక్ చేసేవారిపై మరింత కఠిన చర్యలుంటాయ్.. అని తేల్చి చెప్పింది మృణాల్ ఠాకూర్.
ఈ క్రమంలో కొందరు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వున్న డీప్ ఫేక్ కంటెంట్‌ని తొలగిస్తున్నారు. కొందరు, పూర్తిగా తమ అక్కౌంట్లను డిలీట్ చేసేసుకుంటున్నారు కూడా.
నిజానికి, డీప్ ఫేక్ కంటెంట్ చేయడం అనేది ఓ ఉన్మాదంగా పరిగణించాల్సి వుంటుంది. బాధితులు ఫిర్యాదు చేసే వరకూ కాకుండా, ముందుగానే వీటిని గుర్తించి, తొలగించేలా చర్యలు తీసుకోవాల్సి వుంది.
సోషల్ సెన్సార్ తప్పనిసరి..
ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌దే ఈ బాధ్యత అంతా. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో, అడల్ట్ కంటెంట్ మీద సెన్సార్ అనేది చూస్తున్నాం.
ఈ డీప్ ఫేక్ వల్గారిటీ విషయంలోనూ, ‘సెన్సార్’ తప్పనిసరి. అన్నట్టు, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా డీప్ ఫేక్ బాధితురాలిగా మారిపోయింది.
గత కొద్ది రోజులుగా సారా టెండూల్కర్ వీడియో.. అంటూ, డీప్ ఫేక్ కంటెంట్ సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం పొందుతోంది.
ఇటీవలి కాలంలో ఈ డీప్ ఫేక్ కంటెంట్, అచ్చం ఒరిజినల్ అనేలా రూపొందుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వల్ల వచ్చిన మార్పు ఇది.
ఏదిఏమైనా, మృణాల్ ఠాకూర్ తెగువని అభినందించకుండా వుండలేం. సెలబ్రిటీలంతా ఈ విషయమై ఒక్కతాటిపైకి వచ్చి, కొత్త చట్టాల దిశగా తమవంతు ప్రయత్నం ప్రభుత్వాలపై ఒత్తిడి చేసేలా చేస్తే బావుంటుంది.
