Table of Contents
Kalyan Dileep Sunkara Boothulu.. కళ్యాణ్ దిలీప్ సుంకర.. అనే న్యాయవాది గురించి ఇలాంటి చర్చ ఒకటి తెరపైకొస్తుందని బహుశా ఎవరూ ఊహించి వుండరు.!
‘తన నోరే తనకు శత్రువు’ అని పెద్దలు కొన్నిసార్లు మనల్ని హెచ్చించడం గుర్తుండే వుంటుంది.! ఔను, మన నోరే మనకి బలం, అదే మన బలహీనత కూడా.!
కళ్యాణ్ దిలీప్ సుంకర (Kalyan Dileep Sunkara) విషయంలోనూ అంతే.! ఆయనకు ఆ నోరే బలం.! అదే, ఆయనకు బలహీనతగా మారింది కూడా.!
Kalyan Dileep Sunkara Boothulu.. ఎలా వుండాల్సినోడివి కళ్యాణ్.?
ఏ చట్ట సభల్లోనో వుండాల్సిన వ్యక్తి కళ్యాణ్ దిలీప్ సుంకర. జనసేన పార్టీకి ఒకప్పుడు మద్దతుదారుడిగా మాత్రమే కాదు, జనసేన నాయకుడిగానూ చెలామణీ అయ్యారాయన.
కానీ, కళ్యాణ్ దిలీప్ సుంకరని ఎందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూరం పెట్టినట్లు.? ఇదిగో, ఇందుకే.! ఈ నోటి దురుసుతనం వల్లే.!
రాజకీయాల్లో ఒకింత సంయమనం అవసరం. కులాల గురించి ప్రస్తావించేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వుండాలి. మీడియా ముందర మరీనూ.!
బూతుల కళ్యాణం.. దేనికోసం.?
అయితే, కళ్యాణ్ దిలీప్ సుంకర రూటే సెపరేటు.! తాజాగా, ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో, శేఖర్ భాషా అనే వ్యక్తిని బండ బూతులు తిట్టేశాడు కళ్యాణ్ దిలీప్ సుంకర.
సభ్య సమాజం హర్షించని పదజాలం అది.! మరి, వైసీపీ నేతలూ గతంలో ఇదే భాష మాట్లాడారు కదా.? అంటే, ఔనేమో.. వైసీపీ వైపు ఎన్నికల ముందర టర్న్ అయిన కళ్యాణ్ దిలీప్ సుంకర, ఆ భావజాలానికి అలవాటుపడిపోయారేమో.!
భావజాలం కాదది, బూతు జాలం.! రాజకీయాల్లో బూతులే భవిష్యత్తు.. అని నమ్మి, నట్టేట మునిగారు చాలామంది వైసీపీ నాయకులు.
ఇదా సంస్కారం.?
యూ ట్యూబ్ ఛానల్ ద్వారా నీతులు చెప్పే కళ్యాణ్ దిలీప్ సుంకర, బూతులు తన వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తాయని తెలుసుకోకపోతే ఎలా.?
సినీ నటుడు రాజ్ తరుణ్ మీద ఆయన భార్యగా చెప్పుకుంటున్న లావణ్య అనే యువతి తరఫున కళ్యాణ్ దిలీప్ సుంకర న్యాయవాదిగా వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: తల్లి చిన్మయి, తండ్రి రాహుల్.! ఓ చిన్నారి.. వ్యధ.!
ఆ రాజ్ తరుణ్ స్నేహితుడే శేఖర్ భాషా.! ఆ శేఖర్ భాషాపైన, ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రయోగించిన బూతులు.. వివాదాస్పదమయ్యాయి.