Kiara Advani Pet Dog Rhyme.. ఏం బతుకురా నీది.? కుక్క కన్నా హీనం నీ బతుకు.! అంటూ, సరదాగానో.. సీరియస్గానో.. తిట్లు తిననివారెవరైనా వుంటారా.? ఏమో, చాలా చాలా కష్టమే.!
నిజానికి, కుక్క బతుకు.. అంటే, అది చాలా చాలా ఘనమైనది ఈ రోజుల్లో. సాధారణ మనుషులదేముంది, ఎలాగోలా బతికేస్తారు. కుక్కల వ్యవహారం వేరే.!
ఊర కుక్కల్నే తీసుకుంటే, వాటిని కొడితే నేరం.! జంతు ప్రేమికులు గగ్గోలు పెట్టేస్తారు.. సోషల్ మీడియాలో నానా యాగీ చేసి, జైలుకు పంపించేదాకా నిద్ర పోరు.!
అదే, నడి రోడ్డు మీద ఓ మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తే, మాట్లాడేందుకు సోకాల్డ్ జంతు ప్రేమికులకు నోరు పెగలదు. ఎందుకంటే, మనిషి జంతువు కాదు కదా.!
Kiara Advani Pet Dog Rhyme.. ఇదీ ఈ కుక్క పురాణం.!
ఇంతకీ, ఈ కుక్క పురాణం ఇప్పుడెందుకంటారా.? పైన చూస్తున్నారు కదా.. అందుకే.!
వెనకటికి, ‘కుక్క వుంటే, రాయి వుండదు.. రాయి వుంటే, కుక్క వుండదు.. రెండూ వుంటే.. అది రాజుగారి కుక్క.. ఏం చేస్తాం, చేతిలో రాయి వున్నా.. ఎదురుగా కుక్క వున్నా.. రాజుగారి కుక్క కాబట్టి కొట్టడానికి వీల్లేదు’ అని ఓ వ్యవహారికం వుంది.
అందాల భామ కియారా అద్వానీ (Kiara Advani) పక్కన దర్జాగా కూర్చున్న ఈ కుక్క పేరు ‘రైమ్’. కుక్క అనకూడదు దీన్ని, ‘పెట్’ అనాలి. పెట్ లేదా.. పెట్ డాగ్.!
ఎవరీ రైమ్.? ఎందుకింత రాజసం.?
ఇంతకీ, ఎవరీ రైమ్.? కియారా అద్వానీ పెంపుడు కుక్క కాదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), ఆయన సతీమణి ఉపాసన (Upasana) పెంచుకుంటోన్న క్యూట్ డాగీ ఇది. అద్గదీ అసలు సంగతి.

పుడితే కుక్కలా పుట్టాలి.! బతుకంటే దానిదీ.. అని చాలామందికి అనిపించొచ్చుదాక.! నిజమే, ఇంతకన్నా రాజసం అనుభవిస్తున్న పెట్ డాగ్స్ చాలానే వున్నాయ్. అదో సరదా డబ్బున్నోళ్ళకి.
Also Read: ‘లిప్ లాక్’ చేసేశావ్.! ‘ఆ..’ పబ్లిసిటీ వచ్చిందా రామకృష్ణా.?
అదండీ అసలు సంగతి.! ఇకపై ఎవర్నీ కుక్కలతో పోల్చకండి. ‘ఛీ కుక్క బతుకు’ అని మాత్రం అనకండి. వాటి లగ్జరీనే వేరు.! కండిషన్స్ అప్లయ్.. అన్ని కుక్కలూ ఒకేలా వుంటాయనుకుంటే పొరపాటే.!