‘జెర్సీ’ సినిమా చూసినప్పుడే చాలామందికి అనిపించింది.. జాతీయ అవార్డు ఖాయమని. ‘మహర్షి’ సినిమా విషయంలో కూడా ఇదే తరహా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందరి అంచనాలకు తగ్గటుగానే ‘మహర్షి’, ‘జెర్సీ’ (Maharshi and Jersey Won National Awards) సినిమాలు జాతీయ పురస్కారాలు దక్కించుకున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Maheshbabu) హీరోగా నటించిన ‘మహర్షి’ (Maharshi Movie) చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన విషయం విదితమే. పూజా హెగ్దే (Pooja Hegde) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా, అల్లరి నరేష్ (Allari Naresh) ఓ కీలక పాత్రలో కనిపించాడు.
‘మహర్షి’ (Maharshi film) సినిమాకి సంబంధించి కొరియోగ్రాఫర్ రాజు సుందరం జాతీయ పురస్కరాన్ని గెల్చుకోగా, నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కూడా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.
ఉత్తమ వినోదాత్మక చిత్రం కేటగిరీలో ఈ సినిమాకి జాతీయ పురస్కారం లభించింది.
ఇక, నాని ‘జెర్సీ’ (Jersey Movie Telugu) విషయానికొస్తే, ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం గెలుచుకుంది. ఎడిటింగ్ విభాగంలోనూ ఈ సినిమాకి మరో పురస్కారం దక్కింది. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకుడు.
శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath) ఈ సినిమాలో నాని (Natural Star Nani) సరసన హీరోయిన్‌గా నటించింది. క్రికెట్ నేపథ్యంలో ‘జెర్సీ’ (Jersey Telugu Film) సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
మొత్తంగా, ఈ రోజు ప్రకటితమైన జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాకి (Maharshi and Jersey Won National Awards) మొత్తం ఐదు పురస్కారాలు దక్కడం బాగానే వున్నా, మరిన్ని కేటగిరీల్లో మరిన్ని పురస్కారాలు దక్కి వుంటే బావుండేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
జాతీయ ఉత్తమ నటిగా ‘మణికర్ణిక’ సినిమాకిగాను పురస్కారాన్ని గెలుచుకుంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut).