Malaika Arora ఏమొచ్చింది పోయేకాలం.? అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. సెలబ్రిటీలు కదా, పబ్లిసిటీ స్టంట్లు చేయాల్సిందే. లేకపోతే, తమకు లభించిన గుర్తింపుని నిలబెట్టుకోవడం కష్టం.
అయితే మాత్రం, మరీ ఇంతలా దిగజారిపోవాలా.? బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ఇలాగే నెటిజనం తిట్టిపోస్తున్నారు.
తిట్టుకోని.. అలాక్కూడా వచ్చేది పబ్లిసిటీనే కదా.? అని బహుశా మలైకా అనుకుంటోందేమో.! ఈ కెవ్వు కేక బ్యూటీకి అప్పుడెప్పుడో.. 1998లోనే పెళ్ళయ్యింది.. 2017లో విడాకులూ తీసుకుంది.
Malaika Arora ఇరవయ్యేళ్ళ కొడుకున్నాడు.. కానీ, కుర్రాడితో ప్రేమలో పడింది..
ప్రేమకి వయసుతో పనేంటి.? పెళ్ళికీ వయసుతో పనేమీ లేదు. ఎన్నిసార్లైనా ప్రేమించొచ్చు.. ప్రేమని ఎందరికైనా పంచెయ్యొచ్చు.!
అర్భాజ్ ఖాన్‌తో విడాకుల తర్వాత, తనకంటే వయసులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడింది మలైక.
అప్పట్లో బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్భాజ్ ఖాన్‌ని కూడా ప్రేమించే పెళ్ళి చేసుకుంది మలైక. వైవాహిక బంధంలో చాన్నాళ్ళ తర్వాత సర్దుకుపోలేక, ఆ బంధం తెగతెంపులైపోయింది.
యెస్ చెప్పి.. తుస్సుమనిపించేసి..
తాను ‘యెస్’ చెప్పేసినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది మలైక. దాంతో, ఆ ‘యెస్’కి అర్థమిదేనంటూ అర్జున్ కపూర్ – మలైకల పెళ్ళి గురించి కథనాలు పుట్టుకొచ్చాయ్.

ప్రేమ గుర్తులు పెడితే మాత్రం, పెళ్ళి గురించేనా.? అన్నట్టు.. అసలు విషయం బయటపెట్టింది మలైక. ఓ ఓటీటీ వేదికపై ఓ రియాల్టీ షోలో తాను కనిపించబోతున్నానన్నది మలైక ఉద్దేశ్యం. దానికే ‘యెస్’ చెప్పిందట ఆమె.
నవ్విపోదురుగాక వాళ్ళకేటి.? అన్నట్టు తయారైంది పరిస్థితి. పబ్లిసిటీ స్టంట్లు మామూలుగానీ.. మరీ ఇంత నీఛంగానా.? అంటూ నెటిజనం మండిపడుతున్నారు మలైక మీద.
Also Read: అరరె.! పెళ్ళయిపోయిందే.! ఇప్పుడెలా.?
ఆమె తప్పేముంది.? తింగరోళ్ళున్నారు కాబట్టి.. వాళ్ళని ఇంకాస్త తింగరితనంలోకి నెట్టేయాలనుకుందంతే.!
ఇంతకీ మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఎప్పుడు పెళ్ళి చేసుకోబోతున్నారు.? మళ్ళీ ఇదొక తింగరి ప్రశ్న. అసలు పెళ్ళితో పనేంటి.? ఔను కదా, ప్రేమించుకుంటున్నారో.. సహజీవనమే చేస్తున్నారో అది వాళ్ళిష్టం.
సహజీవనం తప్పు కాదు.! పెళ్ళికి ముందు శృంగారమూ నేరం కాదు.! సో, లైఫ్‌ని మలైకా, అర్జున్ ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చుగాక.
సెలబ్రిటీలు కదా, వాళ్ళ గురించి ఏ ఇంట్రెస్టింగ్ గాసిప్ అయినా.. దానికి బోల్డంత మైలేజ్ వస్తుంది. ఆ గాసిప్స్‌కి ఆస్కారం కల్పించి పబ్లిసిటీ స్టంట్లు ఎలా చెయ్యాలో మలైకకి బాగా తెలుసు.