Table of Contents
Nayanthara Political Entry.. తమిళనాడు రాజకీయాల్లో జయలలిత ఓ సంచలనం.! మళ్ళీ ఆ స్థాయిలో ఇంకో సినీ తార, అందునా మహిళ.. తమిళనాట రాజకీయాల్లో తనదైన ముద్ర వేయబోతోందా.?
ఈ లిస్టులో ముందుగా వినిపిస్తున్న పేరు, నటి త్రిష కృష్ణన్‌దే.! తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌కి త్రిష అత్యంత సన్నిహితురాలు.
తన భార్యకు విడాకులు ఇచ్చేసి, త్రిషని విజయ్ పెళ్ళాడబోతున్నాడంటూ ఇటీవలి ఎన్నికలకు ముందు నానా యాగీ జరిగింది.
టీవీకే విజయ్, తన భార్య నుంచి విడాకుల కేసు కూడా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. త్రిష మోజులో పడి తన భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ విజయ్ సతీమణి కోర్టును ఆశ్రయించారు కూడా.
టీవీకే విజయ్ పార్టీలో త్రిష హంగామా..
అదంతా వేరే చర్చ మళ్ళీ.! విజయ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు త్రిష చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
విజయ్ పార్టీ టీవీకేలో, త్రిషదే నెంబర్ టూ పొజిషన్.. అన్న ప్రచారమూ జరుగుతోంది. త్రిష మాత్రం, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుంది. అసలంటూ, తాను రాజకీయాలకు దూరమని చెబుతోందామె.
మరిప్పుడు, కొత్తగా తమిళనాడు రాజకీయాల్లో వినిపిస్తున్న పేరు ఎవరిది.? ఇంకెవరిది నయనతారదే.! త్రిషతో పోల్చితే, నయనతార స్టార్‌డమ్ వేరే లెవల్. ఇది అందరికీ తెలిసిన విషయమే.
రెమ్యునరేషన్ పరంగా చూస్తే, హయ్యస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ నయనతార. అంతేనా, లేడీ సూపర్ స్టార్.. అనే ఇమేజ్ కూడా నయనతార సొంతం.
Nayanthara Political Entry.. రాజకీయాల్లోకి నయనతార.. ఛాన్సెంత.?
తాజాగా, ఓ సేవా కార్యక్రమంలో నయనతార కుటుంబం పాల్గొనడం, రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. నయనతార రాజకీయాల్లోకి రాబోతోందన్న ప్రచారం జోరందుకుంది.
అయితే, నయనతార భర్త విఘ్నేష్ శివన్ మాత్రం, ప్రస్తుతం నయనతార సినిమాలు అలానే, కుటుంబ వ్యవహారాల్లో బిజీగా వుందని మాత్రమే సెలవిచ్చాడు.
రాజకీయాల్లోకి నయనతార వస్తుందా.? లేదా.? అన్నదానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు విఘ్నేష్ శివన్. గతంలో ఖుష్బూ, నగ్మా సహా.. చాలామంది సినీ తారలు తమిళనాడు రాజకీయాల్లో యాక్టివ్‌గా వున్నారు.
కానీ, జయలలిత స్థాయిని ఏ సినీ నటీ ఇప్పటిదాకా తమిళనాడులో అందుకున్న దాఖలాల్లేవు. ఏమో, సమీప భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాల్సి వస్తే, నయనతార ఆ స్థానాన్ని భర్తీ చేయగలదేమో.!
ఏమో.. గుర్రం ఎగరావచ్చు..
ఇంతకీ, తమిళనాడులో ప్రస్తుతం పొలిటికల్ వాక్యూమ్ వుందా.? కనీసం, నయనతారకి మినిమమ్ పొలిటికల్ స్పేస్ అయినా దక్కతుందా.?
డీఎంకే పార్టీ కావొచ్చు, ఏఐఏడీఎంకే పార్టీ కావొచ్చు.. కాంగ్రెస్ లేదా బీజేపీ కావొచ్చు.. సినీ తారలకు గాలం వేసే పరిస్థితి తమిళనాడులో వుందా.? లేదా.? అన్నదానిపై పెద్ద డిబేట్ నడుస్తోంది.
సందట్లో సడేమియా, నయనతార పొలిటికల్ గాసిప్స్ ఓ రేంజ్‌లో షికారు చేసేస్తున్నాయిప్పుడు.
రేపో మాపో ఏదన్నా సందర్భంలో మీడియా ముందుకు నయనతార వస్తే, ఆమె ఈ పొలిటికల్ ప్రశ్నకి సమాధానం చెప్పక తప్పదు.