Home » దర్శకుడు పక్కలోకి రమ్మన్నాడు.! సినిమాల్ని మానేశాను.!

దర్శకుడు పక్కలోకి రమ్మన్నాడు.! సినిమాల్ని మానేశాను.!

by Mudra369 Editorial Desk
0 comments
Niti Taylor

Niti Taylor Slams Tollywood Director.. నీతి టేలర్ గుర్తుందా.? ఎలా గుర్తుంటుంది.? మూడు సినిమాలతోనే తెలుగు తెరకు దూరమైపోయిందీ బ్యూటీ.! పైగా, అందులో ఏదీ హిట్టు సినిమా కాదు.!

ఇప్పుడీ నీతి టేలర్ గురించిన డిస్కషన్ ఎందుకంటే, ఓ తెలుగు దర్శకుడి మీద సంచలన ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కింది గనుక.!

ఎవరా దర్శకుడు.? ఏమా కథ.? పేరైతే నేరుగా చెప్పలేదుగానీ, ఓ తెలుగు సినిమా చేశాను.. తొలి సినిమా అది. ఆ దర్శకుడే, ఇంకో ఛాన్స్ ఇవ్వడం కోసం ‘పక్కలోకి రావాలి’ అన్నాడని ఆరోపించింది నీతి టేలర్.

Niti Taylor Slams Tollywood Director.. ఎవరా దర్శకుడు.? ఏమా కథ.?

‘మేం వయసుకు వచ్చాం’ సినిమా రిలీజ్ అయి, చాలా ఏళ్ళయిపోయింది. ఇన్నేళ్ళకు ఆ సినిమా దర్శకుడి మీద నీతి టేలర్, ఇంత దారుణమైన ఆరోపణలు ఎలా చేయగలిగింది.?

ఏమో, అప్పట్లో చెప్పలేకపోయిందేమో.! ఆమె చెప్పిందంతా నిజమేనేమో.! అప్పట్లో ఆ దర్శకుడికి భయపడి, మానసిక క్షోభ అనుభవించిందేమో.!

Niti Taylor
Niti Taylor

అంతేనా.? ఇంకేమైనా వుందా.? ఏమో, వార్తల్లో వ్యక్తిగా మారడానికి సదరు దర్శకుడి మీద నీతి టేలర్ బురద చల్లుతోందేమో.! ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే మరి.!

ఈ తరహా ఆరోపణలు తెలుగు సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తుల మీద వేయడం, కొంతమంది హీరోయిన్లకు అలావాటైన వ్యవహారంగా మారిపోయింది.

రాధికా ఆప్టే అయితే, ఏకంగా ఓ స్టార్ హీరో మీద నిందారోపణలు చేసింది. తెలుసు కదా, ఆ స్టార్ హీరో ఎవరో.! తాప్సీ కూడా, అప్పుడప్పుడూ ఓ తెలుగు దర్శకుడి మీద ఆరోపణలు చేస్తూ వస్తుంటుంది.

Niti Taylor
Niti Taylor

చెప్పుకుంటూ పోతే, ఇలా ‘నన్ను పక్కలోకి రమ్మన్నారు’ అంటూ నిందారోపణలు చేసిన, చేస్తున్న నటీమణుల లిస్టు చాలా చాలా పెద్దదే కనిపిస్తుంది.

అన్నీ నిజాలు కాకపోవచ్చు.. అందులో కొన్ని నిజాలూ వుండొచ్చు. సినిమా అంటేనే గ్లామరస్ ఇండస్ట్రీ.! అలానే, ఇతర రంగాల్లో వున్నట్లే, ఇక్కడా కొంత ‘కక్కుర్తి’ వుండొచ్చుగాక.! వుండదని ఎలా అనేయగలం.?

ఆ దర్శకుడి ఆ వేధింపుల వల్లే, సౌత్ సినిమాల్లో (తెలుగు సినిమాల్లో) మళ్ళీ తాను నటించడానికి ఇష్టపడలేదని నీతి టేలర్ ప్రకటించడం గమనార్హం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group