Operation Sindoor Narendra Modi.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌కి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.!
పహల్గామ్ టెర్రర్ ఎటాక్ తర్వాత, భారత త్రివిధ దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టాయి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్తోపాటుగా, పాకిస్తాన్లో కూడా దాడులు జరిగాయి. ఈ దాడుల్ని అత్యంత త్రివిధ దళాలు చేపట్టడం జరిగింది.
‘ఇకపై భారత దేశం మీద ఏ రూపంలో అయినా దాడి చేయాలనే ఆలోచన పాకిస్తాన్‌కి వస్తే, ఆ తర్వాత మా స్పందన అంతకు మించిన స్థాయిలో వుంటుంది’ అని త్రివిధ దళాలు హెచ్చరించాయి.
Operation Sindoor Narendra Modi.. ఆపరేషన్ సిందూర్ – పాకిస్తాన్ కకావికలం..
పాకిస్తాన్‌కి చెందిన పలు ఎయిర్ బేస్‌లు, ‘ఆపరేషన్ సిందూర్’తో తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇంకోపక్క, పాకిస్తాన్‌లోనూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ తీవ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి.
ఎంతమంది తీవ్రవాదులు చనిపోయారు.? ఎంతమంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు.? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సింది పాకిస్తానేనని భారత త్రివిధ దళాలు తేల్చి చెప్పాయి.
ఇక, ప్రధాని నరేంద్ర మోడీ, జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, ‘ఇకపై ఇదే న్యూ నార్మల్’ అని ప్రకటించారు.
భారత్ మీద ఏ రూపంలో అయినా దాడి చేయాలని చూస్తే, ఈసారి అస్సలు వదిలిపెట్టబోమని ప్రధాని మోడీ తీవ్రంగా హెచ్చరించారు.
సిందూరం.. పాకిస్తాన్ అంతం..
పహల్గామ్లో మా ఆడపడుచుల సిందూరాన్ని తీవ్రవాదులు చెరిపేశారు.. వారికి ఆపరేషన్ సిందూర్‌తో చావు దెబ్బ ఎలా వుంటుందో రుచి చూపించామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
గతంలోలా, న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేస్తే కుదరదన్న ప్రధాని నరేంద్ర మోడీ, ఈసారి ఏస్థాయికైనా వెళ్ళి, పాకిస్తాన్‌పై మరింత తీవ్రమైన ఆపరేషన్ చేపట్టడానికీ వెనుకాడబోమన్నారు.
Also Read: అంబటి రాయుడి ‘గుడ్డి’ సిద్ధాంతం.!
భారత ఆయుధ సంపత్తి ముందు పాకిస్తాన్ వెలవెలబోయిందనీ, పాకిస్తాన్ కోలుకునే అవకాశమూ లేదని చెప్పిన ప్రధాని మోడీ, పాకిస్తాన్ బతకాలంటే, తీవ్రవాదాన్ని చంపాలని పాకిస్తాన్‌కే పిలుపునిచ్చారు.
పాకిస్తాన్‌తో ఎట్టిపరిస్థితుల్లోనూ శాంతి చర్చలుండవనీ, ఉగ్రవాదం అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలోనే చర్చలుంటాయని ప్రధాని నరేంద్ర మోడీ కుండబద్దలుగొట్టారు.
ఇప్పుడిక పాకిస్తాన్ ముందున్నది ఒకటే ఆప్షన్. తాము పెంచి పోషిస్తున్న తీవ్రవాదుల్ని అంతమొందించి, భారత్‌కి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ని అప్పటించడం.