Pawan Kalyan 100Cr Heroism.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతవరకు వంద కోట్ల క్లబ్బులోకి ఎందుకు చేరలేదు.? నిజానికి, చాలా కారణాలున్నాయ్.! అవి కారణాలు కాదు, రాజకీయ వేధింపులు.!
వాస్తవానికి ‘అజ్ఞాతవాసి’ సినిమానే వంద కోట్ల క్లబ్‌లోకి చేరాలి. కానీ, ఆ సినిమా ఫలితం డిజాస్టర్.! సరే, సినిమాలన్నాక సక్సెస్, ఫెయిల్యూర్ మామూలే.!
‘వకీల్ సాబ్’ సినిమాకి వంద కోట్ల క్లబ్బులో చేరే పొటెన్షియాలిటీ వున్నా, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, ఆ సినిమా వసూళ్ళకి కొంతమేర బ్రేకులేశాయి.
‘భీమ్లానాయక్’ సినిమా విషయంలోనూ అదే జరిగింది. అయినాగానీ, ‘భీమ్లానాయక్’ సినిమాని కొందరు వంద కోట్ల సినిమాగానే పరిగణిస్తారనుకోండి.. అది వేరే సినిమా.
Pawan Kalyan 100Cr Heroism ..అన్నీ వంద కోట్లు.. ఆ పైన సినిమాలే..
ఇప్పుడిక పవన్ కళ్యాణ్ నుంచి రాబోయే సినిమాలన్నీ.. వంద కోట్ల మార్క్‌ని టార్గెట్ చేసుకుని వస్తున్నవే.! అందులో మొదటిది ‘వినోదియ సితం’ తెలుగు రీమేక్.!
సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయ్.! టైటిల్ ఇంకా ఖరారవలేదు. ‘బ్రో’ అనే టైటిల్ పరిశీలనలో వుంది.

సరే, ఏ సినిమా ఎంత వసూలు చేస్తుందన్నది వేరే చర్చ. కానీ, పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ పరంగా వంద కోట్లను దాదాపు టచ్ చేసేసినట్లేనన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.
రోజుకి రెండు కోట్లు, ఆ పైన రెమ్యునరేషన్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ‘వినోదియ సితం’ తెలుగు రీమేక్ కోసం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు కూడా.!
ఆ లెక్క, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల రెమ్యునరేషన్.. దాదాపు వంద కోట్లను టచ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
నిర్మాతలు ఇస్తున్నారంటేనే..
వంద కోట్లు.. ఆ పైన వసూళ్ళ అంచనాలు లేకపోతే, ఏ నిర్మాత అయినా, పవన్ కళ్యాణ్‌కి డెబ్భయ్ కోట్ల వరకూ రెమ్యునరేషన్ ఎందుకు చెల్లిస్తారు.?
Also Read: యుద్ధ విమానంపై హనుమాన్.! ఎందుకీ కాంట్రవర్సీ.!
ఏ రాజకీయ కుట్రలు.. ఏ రాజకీయ కక్ష సాధింపులు ఎలా వున్నా.. ఎవరెలాంటి తక్కువ లెక్కలేసినాగానీ, పవన్ కళ్యాణ్ అంటే 100 కోట్ల హీరో.! ఇందులో ఇంకోమాటకు తావు లేదు.