Jana Sena National Politics.. ఆంధ్ర ప్రదేశ్‌లో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన జన సేన పార్టీ, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బల పడేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.
ఇంకోపక్క, కర్నాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లోనూ జన సేన పార్టీకి అభిమానులున్నారు.
సినీ నటుడిగా మాత్రమే కాదు, రాజకీయ నాయకుడిగానూ పవన్ కళ్యాణ్‌ని అభిమానించేవారి సంఖ్య ఆయా రాష్ట్రాల్లో గణనీయంగా పెరుగుతోంది.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, జన సేన పార్టీ ఖచ్చితంగా ఓట్ల పరంగా, సీట్ల పరంగా తనదైన ప్రత్యేకతను సంతరించుకోనుందన్నది నిర్వివాదాంశం.
Jana Sena National Politics.. పొరుగు రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు..
ఇదిలా వుంటే, తాజాగా కర్నాటకలో జన సేన పార్టీ తరఫున నిలబడేందుకు కొందరు రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు.
ఈ నేపథ్యంలో, కర్నాకటలో పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ అధినాయకత్వం సమాలోచనలు చేస్తోంది.
ఇప్పటికిప్పుడు, కీలక నిర్ణయం తీసుకునే అవకాశం లేదుగానీ, రానున్న రోజుల్లో జన సేనాని నుంచి ఖచ్చితమైన నిర్ణయాలుంటాయ్.
తమిళనాడులోనూ అదే పరిస్థితి. అయితే, అక్కడి రాజకీయాలు చాలా చాలా భిన్నంగా వుంటాయి. అయినాగానీ, తమిళనాడులో వున్న తెలుగువారి నుంచి, జన సేన పార్టీకి పలు విజ్ఞప్తులు అందుతున్నాయి.
కేరళ నుంచి కూడా..
ఇటీవల, కేరళ నుంచి కొందరు రాజకీయ నాయకులు, జన సేన అధినాయకత్వంతో చర్చలు జరిపారు.
దాంతో, కేరళలోనూ జన సేన పార్టీని విస్తరించే దిశగా సమాలోచనలు జరుగుతున్నాయని జన సేన అధినాయకత్వం చెబుతోంది.
ఒక రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చాలంటే, ఓట్లు అలానే సీట్ల పరంగా కొన్ని లెక్కల్ని అందుకోవాల్సి వుంటుంది. ఆ లెక్కల్ని అందుకోగలిగితే, జన సేన పార్టీకి జాతీయ హోదా దక్కుతుంది.
Also Read: ప్రియురాలి ప్రేమాగ్నికి ఆహుతైన ప్రియుడు.!
ముందుగా, బలమైన అడుగు తెలంగాణ నుంచి పడితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు జన సేన పార్టీకి లభిస్తే, సాంకేతికంగా జన సేన పార్టీ జాతీయ స్థాయిని అందుకోగలగుతుంది.
ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం… అంటూ, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ సిద్దాంతాల్లోని కీలకమైన అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తుంటారన్న విషయం విదితమే.
