Payal Ghosh Gossip Allari.. సాధారణంగా సినీ ప్రముఖుల మీద మీడియాలో గాసిప్పులు వస్తుంటాయ్. వాటిల్లో చాలావరకు గాలి వార్తలే.!
అలాంటి గాలి వార్తలకు సినీ అభిమానుల్లో క్రేజ్ ఎక్కువ. అందుకే, గాసిప్స్ కలకాలం వర్ధిల్లుతుంటాయ్. కొందరు సినీ ప్రముఖులు ఆ గాసిప్స్‌ని ఎంజాయ్ చేస్తుంటారు.
కానీ, కొందరు సినీ ప్రముఖులు మాత్రం గాసిప్స్‌పై తీవ్రంగా స్పందిస్తుంటారు. గాసిప్స్ తాలూకూ తీవ్రతను బట్టి, సినీ ప్రముఖుల స్పందన వుంటుందనుకోండి.. అది వేరే సంగతి.
Payal Ghosh Gossip Allari.. గాసిప్ గర్ల్..
పాయల్ గుర్తుందా.? పాయల్ అనగానే, ‘ఆర్ఎక్స్ 100’ ఫేం పాయల్ రాజ్‌పుత్ అనుకునేరు. ఈ పాయల్ వేరు. ఈమె పేరు పాయల్ ఘోష్.
‘ప్రయాణం’ సినిమా గుర్తుందా.? మంచు మనోజ్ గుర్తున్నాడా.? మనోజ్ హీరోగా నటించిన ‘ప్రయాణం’ సినిమాతో తెలుగు తెరపైకి పరిచయమైందీ పాయల్.

ఆ తర్వాత జూనియర్ ఎన్టీయార్ హీరోగా తెరకెక్కిన ‘ఊసరవెల్లి’ సినిమాలో మీరోయిన్ తమన్నా స్నేహితురాలిగా పాయల్ ఘోష్ నటించింది.
సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ప్రచారంలోకి తీసుకొచ్చింది పాయల్. అదీ, తన గురించే కావడం గమనార్హం. తన మాజీ బాయ్‌ఫ్రెండ్స్ లిస్టుని ఈ బ్యూటీ బయటపెట్టింది.
అల్లరోడితో ఏంటీ అల్లరి..
అల్లరి నరేష్‌తో పాయల్ ఘోష్ డేటింగ్ చేసిందట. వామ్మో.! ఇది నిజమేనా.? అన్నట్టు, డేటింగ్ అయితే చేసిందిగానీ, ఫిజికల్ రిలేషన్‌షిప్ ఏదీ లేదని సెలవిచ్చింది పాయల్.
కేవలం అల్లరి నరేష్‌తోనే కాదు, ఆ తర్వాత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో కూడా పాయల్ ఘోష్ డేటింగ్ చేసిందట. అయితే, ఆ ఇద్దరూ ఇప్పుడు తనకు మాజీ బాయ్ ఫ్రెండ్స్ మాత్రమేనని పాయల్ చెబుతోంది.
Also Read: అల్లు అర్జున్ ఆర్మీ దెబ్బకి పారిపోయిన నాగబాబు.?
హ..హ..హ.. ఎవరికీ తెలియని గాసిప్స్ ఇవి.. అంటూ సెటైర్లేస్తున్నారు నెటిజన్స్.! అల్లరి నరేష్‌కి పలువురు హీరోయిన్లతో ఎఫైర్లు అంటగడుతూ బోల్డన్ని గాసిప్స్ విన్నాం. వాటిల్లో ఎక్కడా పాయల్ ఘోష్ పేరు అయితే రాలేదు.
ఇంతకీ, అల్లరి నరేష్ – పాయల్ ఘోష్.. మూడో కంటికి తెలియకుండా ప్రేమించేసుకున్నారని అనుకోవాలా.? అంతేనేమో.!
జస్ట్ పాపులారిటీ కోసం స్వయంగా తానే గాసిప్ సృష్టించేసుకున్నట్లుంది పాయల్ ఘోష్.! గర్లూ.. గాసిప్పూ.. అదిరింది కదూ.! జస్ట్ ఫర్ ఫన్ అంతే.!