Political Power Star PK.. ‘పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాను.. నేను పవర్ స్టార్‌ని కాదు. నన్నలా పిలవొద్దు..’ అంటూ స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో అభిమానుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కానీ, ఇప్పుడు 100 శాతం స్ట్రైక్ రేట్‌తో దేశంలో ఏ పార్టీ సాధించని విజయంగా పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో బంపర్ విక్టరీని సాధించింది జనసేన పార్టీ.
సో, ఇప్పుడైతే పవన్ కళ్యాణ్‌ని ‘పవర్ స్టార్’ అని పిలిచేయొచ్చు.! పవర్ స్టార్ అంటే, సినిమాటిక్ ట్యాగ్ కదా.? అందుకే, ‘పొలిటికల్ పవర్ స్టార్’ అని పిలుచుకోవడం బెటర్.!
Political Power Star PK.. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటీవలి ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బంపర్ మెజార్టీతో గెలుపొందారు.

‘అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం..’ అని వైసీపీ నేతలు కొందరు ప్రగల్భాలు పలికారుగానీ, జనసేనాని పవన్ కళ్యాణ్, సగర్వంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు.
అది కూడా, డిప్యూటీ సీఎం హోదాలో.! ఈరోజే డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు.
రాజకీయాల్లో సరికొత్త మార్పు..
రాజకీయమంటే నిజానికి సేవ.! కానీ, రాజకీయమంటే దోపిడీగా భావించి, రాజకీయాల్లోకి వచ్చినవాళ్ళు అందినకాడికి దోచుకున్నారు.. అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కుపోయి, జైళ్ళకు వెళ్ళొచ్చారు.
అలాంటోళ్ళు అక్రమంగా సంపాదించిన సంపాదనతో రాజకీయాలు చేసి, అధికార పీఠమెక్కడమూ చూశాం. కానీ, పవన్ కళ్యాణ్ రాజకీయం వేరు. ఆయన దృష్టిలో రాజకీయమంటే సేవ.
Also Read: క్రికెట్టూ.. సినిమాలూ.. సూడకపోతే కొంపలు మునిగిపోవ్.!
సాయం చేసి, ప్రజల మన్ననలు పొంది, గెలుపుని సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అందుకే, ఆ జనమే, ‘పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ అని పిలుచుకుంటున్నారు.
దేశ రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ పేరు మార్మోగిపోతోంది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..’ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్‌ని నేషనల్ మీడియా పొగుడుతోంది మరి.!
అందుకే, పవన్ కళ్యాణ్‌ని ‘పొలిటికల్ పవర్ స్టార్’ అని నిస్సందేహంగా అనేయొచ్చు.! అది పవన్ కళ్యాణ్‌కి ఇష్టం వున్నా లేకున్నా.!