Table of Contents
Ramya Naresh Pavitra Lokesh.. ప్రధాన తారాగణం రమ్య రఘుపతి, నరేష్, పవిత్ర లోకేష్.! కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. ఏమో, ఎవరో.! డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయ్.! సినిమా బహు రమ్యముగా నడుస్తోన్నది.!
సీనియర్ నటుడు నరేష్ మీడియాకెక్కారు. నటి పవిత్ర లోకేష్ కూడా మీడియాకెక్కారు. నరేష్ భార్య రమ్య రఘుపతి కూడా మీడియాకెక్కారు.!
నరేష్ – రమ్య మధ్య పదేళ్ళ వైవాహిక బంధం వుందట. కానీ, ఎనిమిదేళ్ళ నుంచీ ఇద్దరూ కలిసి వుండటంలేదట. ఇదెక్కడి పంచాయితీ.? ఏమో, ‘మా అత్తగారు జీవించి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు..’ అంటున్నారు రమ్య.
రమ్య ఆర్థిక నేరాలకు పాల్పడిందని నరేష్ ఆరోపిస్తున్నారు. అంతేనా, డబ్బుల కోసం తనను వేధించిందని అన్నారు. మరి, నటి పవిత్ర లోకేష్ ఈ వ్యవహారంలోకి ఎలా దూరినట్లు.?
Ramya Naresh Pavitra Lokesh.. ఇదేం పంచాయితీ.?
పవిత్ర లోకేష్, నరేష్‌కి మంచి స్నేహితురాలు అట. వెల్ విషర్ కూడానట. ‘నాకూ, నరేష్‌కీ మీ సపోర్ట్ కావాలి..’ అని పవిత్ర లోకేష్ చెబుతున్నారు.
వావ్.! రమ్య రఘుపతి – నరేష్‌లది భార్యాభర్తల మధ్య గొడవ. న్యాయస్థానం విడాకులిస్తే, వీరిరువురూ తమ తమ దారులు విడిగా ఎంచుకోవచ్చు. ఈలోగా, ఈ ఇద్దరూ భార్యాభర్తలే. వారి మధ్యన పవిత్ర లోకేష్ దూరడం చట్ట విరుద్ధం.!

హైద్రాబాద్‌లో రచ్చ చేస్తే ఏముంటుంది మజా.? వెళ్ళి, బెంగళూరులో ‘పంచాయితీ’ పెట్టుకున్నారు. అక్కడి మీడియాని ఈ ముగ్గురూ ఎంటర్టైన్ చేస్తున్నారు.
తెగులు మీడియాకి పండగే.!
మన తెగులు మీడియా.. అదేనండీ మన తెలుగు మీడియా ఊరుకుంటుందా.? వారిని హైద్రాబాద్‌కి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఎవరి గోల వారిదే. పవిత్ర తమ కాపురంలో చిచ్చుపెట్టిందని రమ్య ఆరోపిస్తోంటే, రమ్య క్యారెక్టర్ మీద మచ్చ వేసేలా నరేష్ వ్యవహరిస్తున్నాడు. నరేష్ మంచోడని పవిత్ర చెబుతోంటే, నమ్మించి గొంతు కోయడంలో దిట్ట.. అని నరేష్ గురించి రమ్య చెబుతున్నారు.
పవిత్ర లోకేష్ ఎన్నో కాపురాలు కూల్చిందని రమ్య ఆరోపించడమే కాదు, పవిత్ర భర్తగా చెప్పబడుతున్న వ్యక్తి కూడా అంటున్నారు.
తెగింపా.? బరి తెగింపా.?
మాంఛి కమర్షియల్ సినిమాలో కూడా ఇలాంటి కాన్‌ఫ్లిక్ట్ పెట్టడం ఈ తరం దర్శకులకి కష్టమే.
సినిమాల్లో తమ పాత్రలు నచ్చక, తమకు తామే తమ పాత్రల్ని ఇలా నరేష్, పవిత్ర డిజైన్ చేసుకున్నారా.? అని సెటైర్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో.!
Also Read: శునక యోగం.! రాజసం, వివాదం.! విమానయానం.!
నవ్విపోదురుగాక వాళ్ళకేటి.? సెలబ్రిటీలుగా వున్నారు.. పరువు పోతుందన్న ఇంగితం కాస్తంతైనా లేదు. రచ్చకెక్కి అడ్డగోలు ఆరోపణలు చేసుకుంటున్నారు. సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దామని.?