Rohit Sharma Hit Man క్రికెట్ ప్రపంచంలో ఎందరో గొప్పోళ్ళు వుండొచ్చుగాక. ఆట పరంగా గొప్పోళ్ళు కొందరైతే, వ్యక్తిత్వంలో గొప్పోళ్ళు ఇంకొందరుంటారు. అటు ఆటపరంగా, ఇటు వ్యక్తిత్వం పరంగా చూసుకుంటే.. ‘గొప్పోళ్ళు’ అనబడేవారు చాలా తక్కువమంది వుంటారు. అలాంటి తక్కువ మందిలో ‘ఒకే ఒక్కడు’ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. అనడం అతిశయోక్తి కాకపోవచ్చు.
బంతిని బలంగా కొట్టడంలో రోహిత్ శర్మ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూనే వున్నాడు.. కెరీర్ బిగినింగ్ నుంచి.. ఇప్పటిదాకా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. ఏనాడూ ఎలాంటి బంతికీ భయపడింది లేదు. బిగ్ స్కోర్ చెయ్యాలి.. ఈ క్రమంలో భారీ షాట్లు ఆడాలి.. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తడి పెంచాలి.. తన జట్టుకి విజయాన్ని అందించాలి.. ఇలాగే సాగుతుంటాయి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.
Also Read: నో డౌట్.! అర్జంటుగా విరాట్ కోహ్లీని పీకెయ్యాల్సిందే.!
మైదానంలో ఫీల్డింగ్ కోసం దిగినప్పుడు.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కొట్టే బంతి ఎటువైపు వెళుతుంది.? దాన్ని ఎలా ఒడిసిపట్టాలి.? అని ఆలోచిస్తుంటాడు. అంతేనా, బౌలర్లకు అత్యద్భుతమైన సూచనలు చేస్తుంటాడు. తాను కెప్టెన్ కాకపోయినా, కెప్టెన్ ఎవరైతే వారికి.. సూచనలు సలహాలు ఇస్తుంటాడు ఫీల్డింగ్ పరంగా. దటీజ్ రోహిత్ శర్మ.
Rohit Sharma Hit Man గర్వమా.? అహంకారమా.? నో ఛాన్స్.!
రోహిత్ శర్మని చూస్తే ‘గర్వం’ ఇసుమంతైనా కన్పించదు. అది వన్డే అయినా, టీ20 అయినా, ఐపీఎల్ అయినా.. టెస్ట్ క్రికెట్ అయినా.. రోహిత్ ఒకేలా వ్యవహరిస్తుంటాడు. ప్రతిభను ప్రోత్సహిస్తాడు.. కొత్త కుర్రాళ్ళను భుజం తట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంటాడు.
ఈ విషయంలో చాలా ఉదాహరణలే కన్పిస్తాయ్.. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ సందర్భంగా రెండు ఇన్నింగ్స్‌లోనూ రెండు అర్థ సెంచరీలు చేసిన శార్దూల్ ఠాకూర్ పట్ల ప్రత్యేకమైన అభిమానం చూపించాడు రోహిత్ శర్మ. నిజానికి, ఈ టెస్టులో రోహఇత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే, దానికి తనతోపాటు శార్దూల్ ఠాకూర్ కూడా అర్హుడని రోహిత్ శర్మ వ్యాఖ్యానించడం గమనార్హం.
Also Read: Sachin Tendulkar.. ఈ క్రికెట్ దేవుడికి.. సాటెవ్వడు.!
మైదానంలోకి దిగాక.. దేశం తరఫున ప్రాతినిథ్యం వహించడం.. అన్న ఒక్క ఆలోచన తప్ప, ఇంకేమీ ఆలోచించడు. దటీజ్ రోహిత్ శర్మ. కెప్టెన్సీ విషయంలో వివాదాలు.. కెప్టెన్లతో వివాదాలు.. ఇవేవీ అతన్ని వ్యక్తిత్వాన్ని మార్చలేకపోయాయి.. అతని ఆట తీరుని దెబ్బతీయలేకపోయాయి. ఎందుకంటే, ఆ వివాదాలు రోహిత్ శర్మ ప్రమేయం లేకుండా తెరపైకొచ్చినవే.
గణాంకాలు చూస్తే.. రోహిత్ శర్మ వెరీ వెరీ స్పెషల్.. గుణగణాల విషయంలో చూసుకుంటే.. రోహిత్ శర్మ (Rohit Sharma Hit Man) ఒకే ఒక్కడు.
