సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలు సర్వసాధారణమైపోయాయి. హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే ఒకప్పుడు కనిపించే లిప్ లాక్ సన్నివేశాలు (Salman Khan About Lip Lock With Disha Patani In Radhe), ఇప్పుడు తెలుగు సినిమాల్లోనూ విరివిగా కనిపించేస్తున్నాయి. ‘లిప్ లాక్ లేకుండా సినిమా తీయడం ఎలా.?’ అని ఫిలిం మేకర్స్ ఆందోళన చెందుతున్న రోజులివి.
అసలు విషయంలోకి వస్తే, బాలీవుడ్ కండల హీరో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా అయిన సల్మాన్ ఖాన్, లిప్ లాక్ సన్నివేశాలకు అస్సలు ఒప్పుకోడు. కానీ, తన తాజా చిత్రం ‘రాధే’ కోసం హీరోయిన్ దిశా పటానితో (Disha Patani) కలిసి ‘లిప్ లాక్’ సన్నివేశంలో నటించేశాడు. దాంతో, సల్మాన్ ఖాన్ మాట తప్పాడంటూ విమర్శలు షురూ అయ్యాయి.
ఈ వ్యవహారంపై కాస్త లేటుగా స్పందించిన సల్మాన్ ఖాన్ (Salman Khan), వయసులో తాను దిశా పటానీ కంటే చాలా పెద్దవాడిననీ, అయితే ఆమె వయసుకు తగ్గట్టుగా తన వయసు తగ్గించేసుకోవాల్సి వచ్చిందంటూ తనదైన స్టయిల్లో చమత్కరించాడు సల్మాన్ ఖాన్. అసలామెతో లాప్ లాక్ సన్నివేశమే చేయలేదనేశాడు.
అది జస్ట్ కెమెరా జిమ్మిక్.. అంటూ లిప్ లాక్ సన్నివేశం వెనుక సీక్రెట్ రివీల్ చేసేసరికి అంతా షాకయ్యారు. సల్మాన్ ఖాన్ (Salman Khan About Lip Lock With Disha Patani In Radhe) అంటేనే అంత.. ఏం చెప్పినా, తనదైన ఛమత్కారాన్ని జోడిస్తుంటాడు. నిజానికి, సల్మాన్ ఖాన్ అంటే హీరోయిన్లు పడి ఛస్తారనే భావన వుంది హిందీ సినీ పరిశ్రమలో.
ఎందరో హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేసి, చాలామందితో ఎఫైర్స్ నడిపిన సల్మాన్ (Salman Khan Disha Patani Lip Lock Radhe Seetimaar) ఖాన్ ఇప్పటికీ ‘బ్యాచిలర్’ స్టేటస్ కొనసాగిస్తుండడం గమనార్హం. ‘నాకు పెళ్ళవదు. అసలు నాకు పిల్లనెవరిస్తారు.? ఏ అమ్మాయి అయినా, నన్ను భర్తగా కోరుకుంటుందా.?’ అంటూ అమాయకంగా ప్రశ్నించేస్తుంటాడు సల్మాన్ ఖాన్.