Smita Sabharwal IAS HCU.. ఆమె, సీనియర్ ఐఏఎస్ అధికారిణి.! కాబట్టి, ఆమె ప్రశ్నించకూడదు.! ప్రభుత్వంలో భాగమై వుండీ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎలా.?
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మీద సోషల్ మీడియా వేదికగా దూసుకొస్తున్న ప్రశ్నలివి. నిజానికి, సీనియర్ అధికారి కాబట్టి, ఆమెకి మరింత బాధ్యత వుంటుంది.
సో, స్మితా సభర్వాల్ అలా ప్రశ్నించడం తప్పు కాదు.! ప్రశ్నించినందుకుగాను, ఆమెను తప్పు పట్టడం అస్సలేమాత్రం సబబు కాదు. ప్రశ్నించడం మానేసి, ఆమెని అభినందించాలి.
Smita Sabharwal IAS HCU.. అసలేం జరిగింది.?
హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకుని కంచ గచ్చిబౌలిలో వున్న ప్రభుత్వ భూమికి సంబంధించిన వివాదం గురించి అందరికీ తెలిసిందే.
ఆ భూమిలో జేసీబీలు ఉపయోగించి, చెట్లను తొలగించింది ప్రభుత్వం. అయితే, అక్కడ వన్య ప్రాణులున్నాయనీ, పర్యావరణం దెబ్బ తింటుందనీ.. కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
అబ్బే, అది అటవీ భూమి కాదు.. ప్రభుత్వ భూమి.. అంటోంది తెలంగాణ ప్రభుత్వం. సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు, ఈ క్రమంలో ‘స్టే’ ఆర్డర్.. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి.
అసలేముందక్కడ.?
సోషల్ మీడియాలో సదరు కంచ గచ్చిబౌలి భూముల గురించి ‘ఏఐ జనరేటెడ్ ఇమేజెస్’ హల్ చల్ చేస్తున్నాయి. అలాంటి ఓ పోస్టుని, రీ-పోస్ట్ చేశారు స్మితా సబర్వాల్.
అది కాస్తా, ప్రభుత్వానికి కోపం తెప్పించింది. ఆమెకు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. స్మిత సబర్వాల్ నోటీసులు అందుకున్నారు, వివరణ కూడా ఇచ్చుకున్నారు.
అయితే, దాదాపు 2 వేల మందికి పైగా, సదరు పోస్టుని రీ-ట్వీట్ చేశారు. తనను ప్రశ్నించినట్లే, ఆ రెండు వేల మందినీ ప్రశ్నిస్తారా.? అని స్మితా సబర్వాల్ సంధించిన ప్రశ్నాస్త్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
Also Read: నమ్మి సావండెహె.! ఈ ఊర్వశి ఆ ఊర్వశి కాదు.!
వాళ్ళు వేరు, మీరు వేరు.. అంటూ, సీనియర్ ఐఏఎస్ అధికారికి క్లాసులు పీకుతున్నారు కొందరు. అదండీ సంగతి.! ఇప్పుడున్న ఐఏఎస్ అధికారుల్లో.. తెలుగు రాష్ట్రాల్లో.. స్మితా సబర్వాల్ అంటే, చాలామందికి ఎనలేని గౌరవం.
ఏ బాధ్యతల్లో వున్నా, అత్మంత బాధ్యాతాయుతంగా పని చేయడం వల్ల స్మితా సభర్వాల్కి లభించిన అరుదైన గౌరవం అది.