Snacks And Gossips Tollywood.. ఒకప్పుడు సినీ పరిశ్రమని కాస్త దగ్గరగా చూసినవాడ్ని.! ఇప్పుడు ఆ సినీ పరిశ్రమకి కాస్త దూరంగా వుంటున్నప్పటికీ, స్నేహితులు బోల్డంతమంది.!
నిత్యం సినిమా కబుర్లే.! సినీ పరిశ్రమలో ఏం జరుగుతోందన్నదానిపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే వుంటోంది.
ఫలానా హీరోయిన్ అలాగట.! ఫలానా హీరో ఇలాగట.! ఆ నిర్మాత అలా, ఈ దర్శకుడు ఇలా.. ఏవేవో గాసిప్స్ చెవిన పడుతూనే వుంటాయ్.
అయినా, అవి జస్ట్ గాసిప్స్ మాత్రమే.! అన్నీ నిజాలు కావు. కాకపోతే, కొన్ని నిజాలుంటాయ్. ‘రంకు’ పాత్రికేయం అనొకటుంది. దానికి, ఈ గాసిప్సే పెద్ద ఊతం.!
గాలి పోగెయ్యడమే పాత్రికేయం..
గాలి పోగేసి రాసే ‘గాలి’ వార్తలకి, కొన్ని వెబ్‌సైట్లు పేటెంట్ హక్కుల్ని పొంది వున్నాయి. చేసేది పాత్రికేయ వ్యభిచారం.. పైగా, మేకపోతు గాంభీర్యమొకటి.!
సినిమా ఇంటర్వ్యూల పేరుతో, సినీ ప్రముఖుల ముందు లేనిపోని బిల్డప్ ఇస్తూ, పనికిమాలిన చచ్చు ప్రశ్నలేసేవారు కొందరు.!
తెరవెనుకాల నిర్మాతల్నీ, దర్శకుల్నీ, నటీనటుల్ని బ్లాక్‌మెయిల్ చేసి.. డబ్బులు గుంజేసే రాబందులు ఇంకొందరు.! వెరసి, ఇదో పెద్ద మాఫియా.. అనుకోవచ్చు.
గొర్రె కసాయినే నమ్ముతుందన్నది పెద్దల మాట.! ఈ సినిమా పరిశ్రమ కూడా అంతే, అలాంటి రాబందుల్నీ, బ్లాక్‌మెయిలర్లనీ నమ్ముతుంటుంది. అక్కడే వస్తోంది అసలు సమస్య.
Snacks And Gossips Tollywood.. స్నాక్స్ కక్కుర్తి..
స్నాక్స్ కోసం కక్కుర్తి పడే ఎర్నలిస్టులూ.. లిక్కర్ కోసం ఎగబడే పాత్రికేయ వ్యభిచారులు.. వీళ్ళ గురించీ పుంఖానుపుంఖాలుగా గాసిప్పులు వినిపిస్తుంటాయ్.. కాకపోతే, అవి మీడియాలో కనిపించవ్.!
Also Read: పవన్ కళ్యాణ్‌తో బాలకృష్ణ కలిస్తే.! ‘కమ్మ’గా ‘కాపు’ కాసే కలయికే.!
అవన్నీ, ఇక్కడ.. ‘ముద్ర 369 డాట్ కామ్’లో ప్రస్తావిస్తే ఎలా వుంటుంది.? గాలి పోగేసే వార్తలు కాదు.. నిజాల్నే మాట్లాడుకుందాం.!
అందుకే, స్నాక్స్ అండ్ గా‘చిప్స్’ అని పేరు పెట్టుకున్నాం. వీలు చిక్కినప్పుడల్లా.. ‘స్నాక్స్ అండ్ గాచిప్స్’ అంటూ కొన్ని బాగోతాల్ని బయటపెట్టేద్దాం.! గెట్ రెడీ.!