Surrogacy Twins In Bollywood… సరోగసీ.. అదేనండీ అద్దె గర్భం..ఇది ఈ మధ్య నయా ట్రెండ్. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్కువగా ఈ అద్దె గర్భానికి ప్రాధాన్యతనిస్తున్నారు. అనారోగ్య సమస్యలు, ఇతర్రతా కారణాలతో సెలబ్రిటీలు సరోగసీ వైపు మొగ్గు చూపక తప్పడం లేదు.
ఒకప్పుడు పిల్లల్ని కనలేని పరిస్థితులపై సెలబ్రిటీలు తీవ్ర ఆందోళన చెందేవారు. మానసిక రుగ్మతలకు గురయ్యేవారు. అలా కొందరు సెలబ్రిటీలు చేసేది లేక పిల్లల్ని దత్తత తీసుకునేవారు. సరోగసీతో కథ మొత్తం మారిపోయింది. పిల్లలు లేని తల్లిదండ్రులు, అప్పటికే పిల్లలుండీ, అదనంగా పిల్లలు కావాలనుకుంటున్నవారు, చివరికి సింగిల్ సెలబ్రిటీలు కూడా సరోగసీ ద్వారా సరికొత్తగా ‘పేరెంట్’ స్టేటస్ దక్కించుకుంటున్నారు.
Surrogacy Twins In Bollywood డబుల్ ధమాకా అంటే ఇదీ..
పిల్లల్ని కనే అవకాశం లేదు కాబట్టి, ఒక్కరైనా చాలనుకునే వాళ్లే కాదు.. డబుల్ ధమాకా (ట్విన్స్) కోరుకుంటున్నారు కొందరు సెలబ్రిటీలు. ఆ లిస్టులో బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ (ఇంకా పెళ్లి కాలేదు) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కరణ్ జోహార్‌కి ఇంకా పెళ్లి కాలేదు. కానీ సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు తండ్రయ్యాడు.

అలాగే బాలీవుడ్ హీరోయిన్ కమ్ ఐటెమ్ బాంబ్ సన్నీలియోన్ కూడా సరోగసీ విధానం ద్వారా ఇద్దరు కవలలకు తల్లయ్యింది. అంతకు ముందే సన్నీలియోన్ ఓ పాపను దత్తత తీసుకుంది. ఆ తర్వాతే సరోగసీ విధానం ద్వారా ఇద్దరు కవల(అబ్బాయిలు) లకు తల్లయ్యింది.
మరో బాలీవుడ్ హీరోయిన్ లిసారే, భర్త జేసన్ డెహ్నితో కలిసి సరోగసీ విధానంతో ఇద్దరు కవల (అమ్మాయిలు) లకు తల్లయ్యింది. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలే. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘టక్కరి దొంగ’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
లేటెస్టుగా బాలీవుడ్ నటి ప్రీతి జింటా కూడా సరోగసీ విధానంలోనే తల్లయ్యింది. ప్రీతి, ఆమె భర్త జిన్ సరోగసీ విధానంలోనే (Surrogacy Twins In Bollywood) ఇద్దరు కవలలకు తల్లిదండ్రులయ్యారు. ప్రీతి జింటా తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో ప్రీతి జింటా నటించిన ‘ప్రేమంటే ఇదేరా’, ‘రాజకుమారుడు’ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
సెలబ్రిటీల సరోగసీ ట్విన్స్ సీక్రెట్ ఏంటీ.?
సరోగసీలో సెలబ్రిటీలు ఎక్కువగా కవలలకి ప్రాధాన్యతనిస్తున్నారెందుకు.? ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్న నానుడిని బాగా ఫాలో అవుతున్నట్టున్నారా.? లేక ఖర్చు కలిసొస్తుందని భావిస్తున్నారా.? సరోగసీ కోసం లక్షల్లో కాదు, కోట్లలో కూడా ఖర్చు చేస్తున్నారు. కాబట్టి ఖర్చు గురించి ఆయా సెలబ్రిటీలు ఆలోచించకపోవచ్చు. కానీ, సమ్‌థింగ్ కిక్కు గురించే ఇలా సరోగసీ ట్విన్స్‌కి సెలబ్రిటీలు ప్రాధాన్యతనిస్తున్నారనుకోవాలేమో.
Also Read: చింపేస్తాం.. పోగులే ధరిస్తాం.. అంతా మా ఇష్టం.!
ఇదిలా ఉంటే, బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, శిల్పాశెట్టి తదితరులు అప్పటికే తమకు పిల్లలున్నా సరోగసీ ద్వారా ఇంకోసారి పేరెంట్స్ అయ్యారు. అసలు పెళ్లే చేసుకోకుండా ఏక్తా కపూర్, ఆమె సోదరుడు తుషార్ కపూర్ విడి విడిగా సరోగసీ మార్గంలో పేరెంట్స్ అనిపించుకున్నారు.
కాగా, ఈ సరోగసీ నేపథ్యంలో పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇటీవల హిందీలో కృతి సనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మిమి’ చిత్రం సరోగసీ నేపథ్యంలోనే తెరకెక్కింది. మంచి విజయం అందుకుంది. అలాగే, అప్పుడెప్పుడో ‘ఒబామా’ అను ఓ తెలుగు చిత్రం కూడా సరోగసీ (Surrogacy Twins In Bollywood) నేపథ్యంలోనే తెరకెక్కింది.