Home » వైఎస్సార్సీపీ, టీడీపీ.. ‘ఎనభైల’ రాజకీయ వెకిలితనం.!

వైఎస్సార్సీపీ, టీడీపీ.. ‘ఎనభైల’ రాజకీయ వెకిలితనం.!

by Mudra369 Editorial Desk
0 comments

TDP YSRCP Eighties Trolling.. సోషల్ మీడియా వేదికగా ‘ఎనభైల’ ట్రెండ్ నడుస్తోంది.

తమ ఫొటోల్ని ఏఐ టూల్స్‌కి ఇచ్చేసి, ఇంట్రెస్టింగ్ ఫొటోల్ని అట్నుంచి అందుకుని, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ ట్రెండ్‌లో పాల్గొన్నారు. లక్షల్లో, కోట్లల్లో ఇలాంటి ఫొటోలు సోషల్ మీడియా వేదికగా వరదలా పోటెత్తాయి.

మరోపక్క, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగు దేశం పార్టీ.. సోషల్ మీడియా వేదికగా ‘ఎనభైల రాజకీయం’ వెర్రితనం ప్రదర్శిస్తోంది.

TDP YSRCP Eighties
TDP YSRCP Eighties

నారా లోకేష్, టీచర్‌ని లేపుకుపోయాడనీ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎగ్జామ్ పేపర్లు కొట్టేశాడనీ.. ఓ ఫొటో కార్డ్ వైరల్ అయ్యింది.

స్వర్గీయ ఎన్టీయార్‌ని చంద్రబాబు కొట్టడనీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని జగన్ కొట్టాడనీ.. పేర్కొంటూ కూడా ఏఐ ఫొటోల్ని తయారు చేస్తున్నారు.

ఈ ఫొటో కార్డ్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. స్వర్గీయ ఎన్టీయార్, చంద్రబాబు చేతిలో రాజకీయంగా వెన్నుపోటుకు గురవడం దగ్గర్నుంచి, చాలా అంశాలు ఇలా వైరల్ చేస్తున్నారు.

TDP YSRCP Eighties
TDP YSRCP Eighties

బొత్స సత్యనారాయణని వైఎస్ జగన్ కొట్టారా.? ఇదిప్పుడు ఓ ఏఐ ఫొటో కార్డ్ ద్వారా హాట్ టాపిక్ అయిన అంశం. వివేకానంద రెడ్డిని గొడ్డళ్ళతో నరికేసిన జగన్, అవినాష్.. అంటూ ఇంకో ఫొటో కార్డ్ వైరల్ అవుతోంది.

ఎవరికి తోచినట్లు వాళ్ళు ఏఐ టూల్స్‌ని విచ్చలవిడిగా వాడేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఇదే పెను ప్రమాదం ఏఐ టూల్స్ ద్వారా.

TDP YSRCP Eighties
TDP YSRCP Eighties

కార్టూన్లు, ఇతరత్రా మార్ఫింగ్ వ్యవహారాలు వేరు.. ఏఐ టూల్స్ ఇచ్చే కంటెంట్ వేరు. ఇది అంతకు మించి.! జనాల్లోకి చాలా బలంగా వెళ్లిపోతోందిది.

అటు వైసీపీ అయినా, ఇటు టీడీపీ అయినా.. ఇద్దరూ ఈ ఏఐ టూల్స్ ద్వారా రూపొందించిన ఫొటో కార్డ్స్ వినియోగించడం తగ్గించి తీరాల్సిందే. లేదంటే, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి.

TDP YSRCP Eighties
TDP YSRCP Eighties

పార్టీల అధికారిక హ్యాండిళ్ళు కాదుగానీ, అనుబంధ హ్యాండిళ్ళు వీటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాయి. వీటిని నియంత్రించకపోతే, సామాన్యులూ ఈ ట్రెండ్‌కి అలవాటుపడతారు.

అందుబాటులో వున్న చట్టాల ప్రకారం, ఇలాంటివి తయారు చేయడం చట్ట రీత్యా నేరం. అధికార పక్షం ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. విపక్షమూ బాధ్యతాయుతంగా వ్యవహరించి తీరాల్సిందే.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group